హిట్టు కోసం.. ఆ దర్శకుడి రెమ్యునరేషన్ ఫట్టు.!

నిజమేనా.? అహ నిజమేనా.? నిప్పు లేకుండా పొగ రాదు కదా.! అబ్బే, సినిమాల్లోనూ.. రాజకీయాల్లోనూ నిప్పుతో పని లేకుండానే పొగ పుట్టేస్తుంటుంది. ఓ సినిమా తీశాడా దర్శకుడు. డిజాస్టర్ టాక్ వచ్చింది. అబ్బే, మంచి సినిమానే.. అంటూ లాగించేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో దర్శకుడికి తడిసి మోపెడైపోతుందట.

ప్రముఖ హీరోతో సినిమా.! డ్రీమ్ కాంబినేషన్ అన్న ప్రచారం.! ప్రచారం సందర్భంగా దర్శకుడు చేసిన అతి. వెరసి, సినిమా ఎలాగోలా తక్కువ నష్టాలతో బయటపడే అవకాశం వున్నా, ఆ అతి వల్ల కొంప మునిగిపోతోందిట.

దర్శకుడు ఇప్పటికే తన రెమ్యునరేషన్ లోంచి చాలా మొత్తం బయటకు తీసి ఖర్చు చేయాల్సి వస్తోందిట. హీరో అయితే పైసా తీసే పరిస్థితి లేదు. ఎందుకొచ్చిన తంటా నీకు.? అంటూ సదరు దర్శకుడికి సన్నిహితులు సూచిస్తున్నారట.

‘నాన్సెన్స్.. ఇదసలు నిజం కాదు. సినిమా హిట్టు.. నష్టాలేం లేవు. అన్నీ లాభాలే. దర్శకుడికి అదనపు చెల్లింపులూ జరుగుతాయ్..’ అంటూ ఆ హీరోగారి అభిమానులు చెబుతున్నారు.

ఇటీవలి కాలంలో ఓ డిజాస్టర్ సినిమా మీద అనవసరంగా ఇంత ఖర్చు చేయడం ఇదేనేమో.. అంటూ సినీ జనం చర్చించుకుంటున్నారు. పొగ గట్టిగానే వ్యాపిస్తోంది. అంటే, నిప్పు వున్నట్టేనా.? లేదూ, ఆర్టిఫీషియల్ నిప్పు అనుకోవాలా.? ఏమో, ముందు ముందు తేలుతుంది అసలు కథేంటో.!