కృష్ణంరాజు అల్లుడు కూడా నిర్మాత అనే విషయం మీకు తెలుసా?

టాలీవుడ్ రెబల్ స్టార్ కృష్ణంరాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.1996లో చిలకా గోరింక అనే సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన ఈయన తన సినీ ప్రస్థానంలో సుమారు 108 సినిమాలకు పైగా నటించి పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేశారు.ఈయన తుది శ్వాస వరకు సినిమాలలో నటిస్తూ అనారోగ్య సమస్యల కారణంగా సెప్టెంబర్ 11వ తేదీ మరణించారు. ఇకపోతే కృష్ణంరాజు గారికి కొడుకులు లేకపోవడం వల్ల తన వారసుడిగా ప్రభాస్ ఇండస్ట్రీకి పరిచయం చేశారు. కృష్ణంరాజు వ్యక్తిగత విషయానికి వస్తే దేవి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు.

ఈ దంపతులకు పిల్లలు లేకపోవడం వల్ల ఒక చిన్నారిని దత్తత తీసుకొని తనకి ప్రశాంతి అని నామకరణం చేసి అమ్మాయి బాగోగులు చూసుకుంటున్నారు.అదే సమయంలోనే కారు ప్రమాదంలో సీత దేవి మరణించడంతో తిరిగి కృష్ణంరాజు శ్యామల దేవిని వివాహం చేసుకున్నారు. ఇలా శ్యామలాదేవి ప్రశాంతిని కూతురులా పెంచి పెద్ద చేశారు. ఇక ప్రశాంతిని కృష్ణంరాజు తన మేనల్లుడు నరేంద్రనాథ్ కి ఇచ్చి వివాహం చేశారు. ఇతను కూడా ఇండస్ట్రీలో నిర్మాతగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాతగా కొనసాగుతున్నటువంటి నరేంద్రనాథ్ ప్రబాస్ నటించిన రెబల్, బిల్లా వంటి సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. ఇక ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. అయితే ప్రభాస్ అల్లుడు కూడా ఇండస్ట్రీలో ఓ నిర్మాత అనే విషయం చాలామందికి తెలియదు. ఇక కృష్ణంరాజు గారు మరణించిన తర్వాత ఆయన అంత్యక్రియలలో కూడా నరేంద్రనాథ్ ముందుండి కృష్ణంరాజు గారి కార్యక్రమాలు అన్నింటిని జరిపించారు.