శ్రీ రామచంద్రకు సపోర్ట్ చేసిన దీప్తి సునైనా.. కారణం అదేనా?

బిగ్ బాస్ హౌస్ లో ఉన్నటువంటి షణ్ముఖ్ జస్వంత్ లవర్ గా దీప్తి సునయన అందరికీ తెలిసిందే.అయితే బిగ్ బాస్ హౌస్ లోకి షణ్ముక్ వెళ్ళిన తర్వాత ఈమె బయట అతని గురించి పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తూ అతనికి సపోర్ట్ చేస్తుంది. ఇప్పటివరకు షణ్ముఖ్ జస్వంత్ ను గెలిపించాలని అతనికి సపోర్ట్ చేసిన దీప్తి సునయన ఉన్నఫలంగా శ్రీ రామచంద్రకు మద్దతుగా నిలబడింది. ఇలా తనకోసం సపోర్ట్ చేయడంతో ఎంతో మంది నెటిజన్లు ఆశ్చర్యపోయారు. అయితే దీప్తి సునైనా షణ్ముఖ్ జస్వంత్ ని కాకుండా శ్రీ రామచంద్రకు సపోర్ట్ చేయడానికి కారణం ఏమిటి అనే విషయానికి వస్తే..

టికెట్ టు ఫినాలే రౌండ్ లో భాగంగా శ్రీ రామచంద్ర అధికంగా గాయపడటంతో తను కేవలం బెడ్ కి మాత్రమే పరిమితం అయ్యాడు. అధిక నొప్పితో బాధపడుతున్న శ్రీరామచంద్రని చూసి పింకీ వేడినీళ్లు అతని కాళ్ళకి పోయడంతో అతని నొప్పి మరింత ఎక్కువ కావడంతో బిగ్ బాస్ ట్రీట్మెంట్ చేయించి రెండు కాళ్లకు బ్యాండేజ్ వేయించడంతో నడవలేని పరిస్థితికి వెళ్లారు. ఇలా శ్రీ రామచంద్ర పరిస్థితి చూసి ఎంతో మంది నెటిజన్లు బాధపడ్డారు. ఇక పింకీ తాను చేసిన తప్పు వల్లే శ్రీరామచంద్రకి ఆ పరిస్థితి వచ్చిందని అతనికి క్షమాపణలు చెప్పింది.

ఇక శ్రీ రామ్ చంద్ర ఫ్యాన్స్ అయితే బిగ్ బాస్ పై దారుణంగా కామెంట్లు చేస్తున్నారు. పింకీ వేడి నీళ్ళు పోస్తున్న సమయంలో బిగ్ బాస్ నిద్రపోతున్నారా మరోసారి వారికి హెచ్చరించాలి కదా అంటూ పెద్ద ఎత్తున బిగ్ బాస్ టీమ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా శ్రీరామ్ పరిస్థితి చూసి చాలా మంది ఆయనకు మద్దతుగా నిలబడ్డారు ఈ క్రమంలోనే రవి, ప్రియ తను తొందరగా కోలుకోవాలని తమ మద్దతు తనకు ఉందని వెల్లడించారు.ఈ క్రమంలోనే షణ్ముఖ్ జస్వంత్ ప్రియురాలు మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ దీప్తి సునయన కూడా స్పందిస్తూ శ్రీరామచంద్రకు మద్దతు తెలిపారు.‘మోర్‌ పవర్‌ టూ యూ’ అంటూ దిప్తీ, శ్రీరామ్‌కు మద్దతు ప్రకటించింది.