ఎప్పుడు చస్తావ్ అంటూ ప్రశ్నించిన నెటిజన్.. అదిరిపోయే సమధానం ఇచ్చిన దీప్తి..!

సోషల్ మీడియా ద్వారా ఎంతోమంది ఫేమస్ అయ్యి సెలబ్రిటీలుగా మారారు. అలా యూట్యూబ్ వీడియోస్, షార్ట్ ఫిలిమ్స్, డబ్ స్మాష్ వీడియోస్ తో దీప్తి సునైనా కూడా బాగా పాపులర్ అయింది. ఇలా చిన్న వయసులోనే సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన దీప్తి సునయన 2018లో బిగ్ బాస్ సీజన్ 2 లో పాల్గొనింది. ఈ బిగ్ బాస్ ద్వారా దీప్తి సునయన క్రేజ్ మరింత పెరిగింది. అంతేకాకుండా ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ తో రిలేషన్ లో ఉండటం వల్ల వీరిద్దరూ బాగా ఫేమస్ అయ్యారు.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే దీప్తి సునయన తన అందమైన ఫోటోలతో పాటు డబ్ స్మాష్ వీడియోలతో సందడి చూస్తూ ఉంటుంది. అంతేకాకుండా పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటిస్తూ యూట్యూబ్ లో కూడా తన ఫాలోయింగ్ పెంచుకుంది. ఇటీవల తన ప్రియుడు షణ్ముఖ్ జస్వంత్ తో విడిపోయిన తర్వాత దీప్తి తన జోరు మరింత పెంచింది. ఈ మధ్యకాలంలో పొట్టి బట్టలు వేసుకుని హాట్ ఫోటో షూట్ లతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. కొన్ని సందర్భాలలో ఈ అమ్మడు సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోలతో విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తోంది.

అయితే అప్పుడప్పుడు దీప్తి సునయన సోషల్ మీడియాలో తన అభిమానులతో చిట్ చాట్ చేస్తూ.. ఎన్నో పర్సనల్ విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు మరొకసారి తన అభిమానులతో చిట్ చాట్ చేసింది. ఈ క్రమంలో అభిమానులు అడిగే వింత ప్రశ్నలకు దీప్తి చాలా ఓపికగా సమాధానాలు చెప్తూ వచ్చింది. అయితే ఈ క్రమంలో ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు చెర్రెత్తుకొచ్చిన దీప్తి అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది. తాజాగా దీప్తి అభిమానులతో చిట్ చాట్ చేస్తున్న సమయంలో ఒక అభిమాని నువ్వెప్పుడు చచ్చిపోతావ్? అనే వింత ప్రశ్న వేశాడు. ఈ ప్రశ్నకు దీప్తి సునయన ఏమాత్రం ఆలోచించకుండా నువ్వు పోయిన తర్వాత..అని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది