Undavalli Arun Kumar: మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ త్వరలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రాబోతున్నారు అనే ఒక వార్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఇలా వైయస్సార్ హయాంలో మంత్రులుగాను ఎమ్మెల్యేలుగాను పనిచేసిన వారందరిని జగన్మోహన్ రెడ్డి తన పార్టీలోకి ఆహ్వానించబోతున్నారని ఇప్పటికే సింగనమల మాజీ ఎమ్మెల్యే సాకే శైలజనాథ్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు అయితే త్వరలోనే మరికొంతమంది మాజీ మంత్రులు ఎంపీలు కూడా రాబోతున్నారంటూ వార్తలు హల్చల్ చేశాయి.
ఇలా కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సైతం వైసీపీలోకి రాబోతున్నారంటూ వార్తలు వినపడుతున్నాయి. ఈయన రాజశేఖర్ రెడ్డి హయామంలో రెండు సార్లు ఎంపీగా గెలిచారు అయితే రాష్ట్ర విభజన తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్న అరుణ్ కుమార్ రాజకీయ విశ్లేషకుడిగా పనిచేస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత జగన్ పార్టీని ఏర్పాటు చేసినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఈయన మాట్లాడుతూ వస్తున్నారు.
ఇలా జగన్ కి వ్యతిరేకంగా ఉన్న ఉండవల్లి అరుణ్ కుమార్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తారా అన్న సందేహం అందరిలోనూ కలిగింది. ఒకవేళ వస్తే కనుక జగన్ కి చాలా మేలు కలుగుతుందని అందరూ భావించారు అయితే తాజాగా ఓ కార్యక్రమంలో భాగంగా ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలను కనుక గమనిస్తే ఈయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి పూర్తిస్థాయిలో దూరంగా ఉండబోతున్నారని స్పష్టమవుతుంది.
ఈ సందర్భంగా ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడుతూ ఏపీకి ఆశాజ్యోతి పవన్ కళ్యాణ్ అని తెలిపారు. పవన్ వల్లనే ఏపీ అభివృద్ధి సాధ్యపడుతుందని విభజన హామీలు కూడా ఆయనే పరిష్కరిస్తారని చెప్పారు. తనకు పవన్ మీద ఎంతో నమ్మకం ఉందని అన్నారు. ఏపీకి న్యాయం చేసే విషయంలో పవన్ లో చిత్తశుద్ధి ఉందని అన్నారు. ఈ విషయంలో చంద్రబాబు జగన్ కంటే పవన్ చాలా బెటర్ అంటూ ఈయన మాట్లాడారు.
ఇలా పవన్ కళ్యాణ్ గురించి ఎంతో గొప్పగా మాట్లాడుతూ ఆయనపై ప్రశంసలు కురిపించడంతో ఉండవల్లి అరుణ్ కుమార్ జనసేనకు మద్దతుగా నిలుస్తున్నారని స్పష్టమవుతుంది. ఇలా ఈయన ఒకవేళ రాజకీయాలలోకి వస్తే కనుక జనసేనలోకి వెళ్తారే తప్ప జగన్ చెంతకు అసలు రారని స్పష్టమవుతుంది.