నాన్న రోజుకు 100 ఉత్తరాలు రాసేవారు.. తండ్రిని తలుచుకొని ఎమోషనల్ అయిన అమితాబ్!

బాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోగా కొనసాగుతున్నటువంటి నటుడు అమితాబచ్చన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.80 సంవత్సరాలు వయసులో కూడా ఈయన పలు సినిమాలలో నటిస్తూనే మరోవైపు బుల్లితెర కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈయన బుల్లితెర ప్రసారమవుతున్న కౌన్ బనేగా కరోడ్ పతి కార్యక్రమంలో భాగంగా తన తండ్రిని తలుచుకొని ఎంతో ఎమోషనల్ అయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఓ కంటెస్టెంట్ అమితాబ్ తండ్రి హరివంశారాయ్ బచ్చన్ తమకు రాసిన లేక ఇప్పటికి తమ దగ్గర అలాగే ఉందని వెల్లడించారు.

ఇలా ఆ కంటెస్టెంట్ తన తండ్రి రాసిన లేక గురించి చెప్పడంతో అమితాబచ్చన్ గతంలో తన తండ్రి అభిమానులకు స్వయంగా లేఖలు రాసి పంపించేవారని తన తండ్రి గురించి గుర్తుచేసుకొని ఎమోషనల్ అయ్యారు.అభిమానులు రాసే ఉత్తరాలకు ప్రత్యుత్తరాలు రాస్తూ వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు రాసి ఇవ్వగా వాటిని నేను పోస్ట్ చేసే వాడిని అంటూ ఈ సందర్భంగా అమితాబ్ తన తండ్రి గురించి తెలియజేశారు.

ఇలా నాన్న రోజుకు ఏకంగా వంద ఉత్తరాలకు పైగా రాసేవారు. ఇలా తాను పోస్టులు వేసినప్పటికీ మరోసారి వెళ్లి తాను పంపించిన పోస్టులు వెళ్లాయో లేదో చెక్ చేసుకునేవారు.అంతలా అభిమానులను గౌరవించి వారికి ఉత్తరాలు రాసేవారని ఈ సందర్భంగా హరివంశారాయ్ గురించి అమితాబచ్చన్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. ఇక ఆ కంటెస్టెంట్ దగ్గర ఉన్నటువంటి లెటర్స్ తనకు ఇవ్వాలని అమితాబ్ కోరారు. కచ్చితంగా ఆ లెటర్ ఒక జిరాక్స్ కాపీ అభిమానులకు ఇచ్చి మరొకటి తన వద్ద ఉంచుకుంటానని,ఇంకా తన తండ్రి రాసిన ఉత్తరాలు ఎవరి దగ్గర ఉన్న తనకు పంపించాలని ఈ సందర్భంగా అమితాబ్ వెల్లడించారు.