హైదరాబాద్ మెట్రో స్టేషన్ లో సందడి చేసిన బిగ్ బీ. అందుకోసమేనా?

బాలీవుడ్ స్టార్ హీరో అమితాబచ్చన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో సంవత్సరాలుగా సినిమాలలో నటిస్తూ బాలీవుడ్ ఇండస్ట్రీలోనే నంబర్ 1 హీరోగా గుర్తింపు పొందాడు. ఇదిలా ఉండగా ఇటీవల అమితాబచ్చన్ హైదరాబాద్ మెట్రో స్టేషన్ లో సందడి చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన ఫోటో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే అమితాబ్ ఇలా హైదరాబాద్ మెట్రో స్టేషన్ లో సందడి చేయటం వెనుక కూడా ఒక కారణం ఉంది.

మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ప్రాజెక్టు కె . ఈ సినిమా ద్వార బాలీవుడ్ భామ దీపికా పదుకొనే మొదటి సారిగా తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం కానుంది . సైన్స్‌ఫిక్షన్‌ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా గురించి ఒక వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ప్రభాస్ హీరోగా రూపొందుతున్న ప్రాజెక్ట్ కె సినిమా షూటింగ్‌ వాయిదా పడిందంటూ కొన్ని రోజులుగా రూమర్లు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ రూమర్లపై ప్రాజెక్ట్‌ కె చిత్రబృందం స్పందించి ఈ సినిమా షూటింగ్‌ వాయిదా పడిందని వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ ఈ సినిమాలో కీలకపాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.

తాజాగా ప్రాజెక్ట్ కె సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఇటీవల బిగ్ బీ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. అయితే ఇటీవల అమితాబ్ కు సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినిమా షూటింగ్ లో భాగంగా మెట్రో స్టేషన్ లో జరిగే ఓ సన్నివేశంలో అమితాబ్ బచ్చన్ పాల్గొన్నారు. ట్రైన్‌ సీక్వెన్స్‌ కోసం మెట్రో స్టేషన్ కు వెళ్లిన ఆయనను చూడటానికి ప్రయాణికులు ఆసక్తి చూపారు. దీనికి సంబంధించిన పిక్ వైరల్ అవుతోంది. అంతే కాకుండా ఇటీవల ఒక కార్యాలయ ప్రారంభోత్సవంలో కూడా అమితాబ్ సందడి చేశారు.