ఎన్టీఆర్ 31 నుంచి క్రేజీ అప్డేట్.. ద్విపాత్రాభినయంలో నటించనున్న తారక్?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన త్రిబుల్ ఆర్ సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక ఈ సినిమా ద్వారా ఈయన తన తదుపరి సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే విడుదల చేయాలని భావించారు. ఇక ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్నట్లు అధికారకంగా ఈయన పుట్టినరోజు సందర్భంగా పేర్కొన్నారు.ఇలా ఎన్టీఆర్ తన 30వ సినిమాని కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్నామని ప్రకటించినప్పటికీ ఇంకా ఈ సినిమా ఎప్పుడు షూటింగ్ పనులను జరుపుకుంటుందనే విషయం గురించి ప్రకటించలేదు.

ఇదిలా ఉండగా ఎన్టీఆర్ 31వ సినిమాని కే జి ఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్నట్లు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా వెల్లడించారు. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ అంటేనే సినిమాపై భారీ అంచనాలు పెరుగుతున్నాయి.కే జి ఎఫ్ అంటే బ్లాక్ బస్టర్ సినిమాతో బాక్సాఫీస్ ను షేక్ చేసిన ప్రశాంత్ ఎన్టీఆర్ కోసం అద్భుతమైన కథ సిద్ధం చేశారని ఇదివరకే వెల్లడించారు.అయితే ప్రస్తుతం సలార్ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న ప్రశాంత్ నీల్ ఈ సినిమా పూర్తి కాగానే ఎన్టీఆర్ సినిమాతో బిజీ కానున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా ఎన్టీఆర్ 31 కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ సినిమా పిరియాడిక్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని ఇందులో ఎన్టీఆర్ కి విలన్ గా ఎన్టీఆర్ నటించబోతున్నారని తెలుస్తోంది.అంటే ఈ సినిమాలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయంలో ప్రేక్షకులను సందడి చేస్తున్నట్లు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు రావడంతో సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది.