ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉండాలన్నా ఓటు వేసే ప్రజలకు కొన్ని లెక్కలు ఉంటాయి. 2014లో ఓటు వేసి చంద్రబాబును గెలిపించిన ప్రజలే 2019 ఎన్నికల్లో దారుణంగా ఓడించారు. 2024 ఎన్నికల్లో చంద్రబాబుకు మరోసారి 2019 ఎన్నికల ఫలితాలే ఎదురవుతాయని సర్వే ఫలితాలు చెబుతున్నాయి. చంద్రబాబు చేతిలో ఇప్పటికే దారుణంగా మోసపోయిన ప్రజలు ఆయనను అస్సలు నమ్మడం లేదు.
అయితే ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు పవన్ ను నమ్ముకోవడం కంటే ఎన్టీఆర్ ను నమ్ముకుంటే బెటర్ అని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. పవన్ కళ్యాణ్ సపోర్ట్ తీసుకోవడం వల్ల 30 నుంచి 40 స్థానాలలో టీడీపీ పోటీ చేసే అవకాశం ఉండదు. అదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల సపోర్ట్ కూడా టీడీపీకి దూరమయ్యే అవకాశం అయితే ఉంటుంది.
జూనియర్ ఎన్టీఆర్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే నందమూరి ఫ్యామిలీకి చంద్రబాబు చేసిన అన్యాయాన్ని కూడా ప్రజలు క్షమించే అవకాశం అయితే ఉంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పవన్ ను నమ్ముకుంటే చంద్రబాబు నాయుడు తప్పు చేసినట్టు అవుతుందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. జనసేనతో పొత్తు పెట్టుకుని టీడీపీ ఓడిపోతే మాత్రం రెండు పార్టీల పరువు పోతుంది.
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల కోసం ఏ విధంగా ముందుకెళతారో చూడాల్సి ఉంది. 2024 ఎన్నికల్లో పోటీ చేయడానికి వైసీపీకి ఉన్న స్థాయిలో టీడీపీ, జనసేనకు పోటీ లేదు. ప్రజలను నమ్ముకోకుండా పొత్తులను నమ్ముకుంటే మాత్రం చంద్రబాబుకు, పవన్ కళ్యాణ్ కు భారీ షాక్ తప్పదని తప్పులు పునరావృతం కాకుండా చంద్రబాబు, పవన్ అడుగులు వేయాల్సి ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.