యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ లో రిలీజ్ కానుంది. ఈ చిత్రాన్ని నవంబర్ లో పూర్తి చేయనున్నారు. తరువాత వార్ 2 మూవీ షూటింగ్ లో జాయిన్ కానున్నారు.
ఈ సినిమా కోసం మూడు నెలలు కాల్ షీట్స్ ఇచ్చారు. వచ్చే ఏడాది ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో NTR 31 సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లాల్సి ఉంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సలార్ మూవీ సెప్టెంబర్ 28న రిలీజ్ కాబోతోంది. దీని తర్వత NTR 31 మూవీకి సంబందించిన స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ అవుతుంది. అది కంప్లీట్ కావడానికి సమయం పడుతుంది.
దీని తర్వాత వచ్చే ఏడాది దితీయార్ధంలో ఈ చిత్రం షూటింగ్ స్టార్ట్ కానుందని తెలుస్తోంది. అప్పటికి ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కమిట్మెంట్ లు అన్ని క్లియర్ కావడంతో క్యాస్టింగ్ సెలక్షన్ అంతా ఫినిష్ చేసుకొని వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా జూన్ నెలలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది. ప్రశాంత్ నీల్ సినిమా కంప్లీట్ చేయడానికి కనీసం ఏడాది సమయం తీసుకుంటారు.
పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం కంప్లీట్ అయ్యి థియేటర్స్ లోకి రావడానికి మరో ఆరు నెలలకి పైగా సమయం పట్టొచ్చు. ఈ లెక్కన చూసుకుంటే తారక్, ప్రశాంత్ నీల్ 2026లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది. అయితే తారక్, ప్రశాంత్ నీల్ సినిమా రిలీజ్ కోసం మూడేళ్ళ పాటు ఫ్యాన్స్ ఎదురుచూదాల్సిందే
సలార్ సినిమాని ఈ ఏడాదిలో రిలీజ్ చేయబోతున్న ప్రశాంత్ నీల్ సలార్ పార్ట్ 2 కూడా వచ్చే ఏడాది అందించేందుకు సిద్ధం అవుతున్నారని టాక్. ఆ మూవీ షూటింగ్ కూడా మెజారిటీ ఇప్పటికే కంప్లీట్ అయినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆ సీక్వెల్ ని రిలీజ్ చేసిన తర్వాత NTR 31 మూవీని సెట్స్ పైకి తీసుకొని వెళ్ళే ఛాన్స్ ఉందనే మాట వినిపిస్తోంది.