చరణ్ తారక్ అవసరమైతే మళ్లీ టార్చర్ తప్పదు: రాజమౌళి

చలనచిత్ర పరిశ్రమలోఎన్నో అవార్డులను పురస్కారాలను అందిస్తారు. అయితే ఇండస్ట్రీకి ఆస్కార్ అవార్డులు ఎంతో ప్రతిష్టాత్మకమైనవిగా బావిస్తారు. ఈ క్రమంలోనే ప్రతి ఏడాది ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తారు.అయితే దాదాపు 22 సంవత్సరాల నుంచి ఆస్కార్ అవార్డుల నామినేషన్లకు కూడా భారతీయ చిత్ర పరిశ్రమ దూరంగా ఉందే. అయితే 95వ ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాలలో భాగంగా బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో భాగంగా RRR సినిమా నుంచి నాటు నాటు పాట నామినేషన్ లో ఉన్న విషయం మనకు తెలిసిందే.

ఇలా ఈ పాట ఆస్కార్ నామినేషన్లలో ఉండడంతో చిత్ర బృందం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ విషయంపై ఎంతో మంది సినీ రాజకీయ ప్రముఖులు కూడా స్పందిస్తూ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే ఈ విషయంపై దర్శకుడు రాజమౌళి సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఈ పాట రచయిత సంగీత దర్శకులు, కొరియోగ్రాఫర్, సింగర్స్ గురించి ఎంతో గొప్పగా అభివర్ణిస్తూ ఈయన పోస్ట్ చేశారు.

ఇక ఈ పాటలో ఎన్టీఆర్ రామ్ చరణ్ ఇద్దరూ ఎంతో అద్భుతమైన డాన్స్ పెర్ఫార్మెన్స్ చేసిన విషయం మనకు తెలిసిందే. ఇద్దరిలో ఏ ఒక్కరి స్టెప్ కూడా మిస్ మ్యాచ్ అవ్వకుండా ఎంతో అద్భుతంగా డాన్స్ చేశారు. అయితే రాజమౌళి ఈ హీరోల గురించి ప్రస్తావిస్తూ రామ్ చరణ్ ఎన్టీఆర్ మిమ్మల్ని ఈ పాట కోసం టార్చర్ పెట్టినందుకు సారీ. అయితే కానీ ఇంకోసారి పెట్టాల్సి వస్తే కూడా నేను వెనకాడను రాజమౌళి చెప్పుకొచ్చారు. ఇలా రాజమౌళి ఈ పాట గురించి ఈ పాటకు కారణమైన వారి గురించి ప్రస్తావిస్తూ చేస్తున్నటువంటి ఈ ఎమోషనల్ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.