లైగర్ మూవీ నుండి క్రేజీ అప్డేట్… ఆగష్టు 24 న స్పెషల్ ప్రీమియర్ షో.. ఎక్కడంటే?

ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన సినిమా లైగర్ . పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కాబోతున్న ఈ సినిమా మీద ప్రేక్షకులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. బాక్సింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ బాక్సర్ గా కనిపించనున్నాడు. పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కాబోతున్న ఈ సినిమాని చార్మి, పూరి జగన్నాథ్ , కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ట్రైలర్, టీజర్ సినిమా మీద అంచనాలను అమాంతం పెంచేసాయి.

ఇక ఈ సినిమా నుండి విడుదలైన పాటలు రికార్డు స్థాయిలో వ్యూస్ సాధించాయి. తాజాగా ఈ సినిమా నుండి క్రేజీ అప్డేట్ వచ్చింది. బాలీవుడ్ లో ప్రముఖ నిర్మాతగా గుర్తింపు పొందిన కరణ్ జోహార్ తన సినిమాలని భారీగా ప్రమోట్ చేస్తాడు. ప్రస్తుతం లైగర్ సినిమాకి నిర్మాతగా మారిన కరణ్ ఈ సినిమ ప్రమోషన్ కూడా భారీ స్థాయిలో నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో కరణ్ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న తన ఫ్రెండ్స్ కోసం లైగర్ మూవీని స్పెషల్ ప్రీమియర్ వేయనున్నాడని సమాచారం. అదికూడా సినిమా రిలీజ్ కావటానికి ఒక రోజు ముందు ప్రీమియర్ షో వేయనున్నారు. ఆగస్టు 25వ తేదీన పాన్ ఇండియా లెవెల్ లో అన్ని భాషలలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న లైగర్ సినిమా ప్రీమియర్ షో ఆగస్టు 24వ తేదీన ముంబైలో జరగనుంది.

లైగర్ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ శాటిలైట్, డిజిటల్ రైట్స్ కలుపుకుని 55 కోట్లు పలికినట్టుగా సమాచారం. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఓవర్సీస్ రైట్స్‌ను సరిగమ సినిమాస్ దాదాపుగా 8 కోట్ల రూపాయలు చెల్లించి ఈ సినిమా రైట్స్ దక్కించుకుందని సమాచారం. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ కి జోడిగా అనన్య పాండే నటించింది. సినిమా విడుదల తేది సమీపించటంతో సినిమా ప్రమోషన్ పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే పలు ప్రాంతాలలో పర్యటించిన సినిమా బృందం తెలుగు రాష్ట్రాలలో కూడా ప్రమోషన్ పనులు మొదలు పెట్టనున్నారు. ఈ క్రమంలో ఆగష్టు 14 వ తేదీన వరంగల్ లోని ఆర్ట్స్ కాలేజీలో ఒక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.