టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోగా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. అయితే ఈయన రీఎంట్రీ తర్వాత పెద్దగా ఆశించిన స్థాయిలో ఏ సినిమా విజయం అందుకోలేకపోయింది. ముఖ్యంగా ఆచార్య వంటి డిజాస్టర్ సినిమా తర్వాత మెగాస్టార్ గాడ్ ఫాదర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా దసరా పండుగ సందర్భంగా విడుదలై ఎంతో మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా భారీ హిట్ అందుకోవడంతో చిత్ర బృందం హైదరాబాద్ లో సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఈ సినిమా నిర్మాతలలో ఒకరైన ఎన్వీ ప్రసాద్ మాట్లాడుతూ చిరంజీవి గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.ఈ క్రమంలోనే ఈయన చిరంజీవి రాజకీయాల గురించి మాట్లాడుతూ అందరూ చిరంజీవి తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలోకి విలీనం చేసి భారీగా డబ్బు పొందారని తన పార్టీని అమ్ముకున్నారంటూ మాట్లాడారు అయితే ఈ వార్తలలో ఎలాంటి నిజం లేదని ఇది పూర్తిగా అవాస్తవమని తెలిసిన మెగాస్టార్ ఒక్క మాట కూడా మాట్లాడలేదని తెలిపారు. ఈ పార్టీవల్ల చిరంజీవి పెద్ద ఎత్తున నష్టపోయారు అందుకే ఈ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు.
ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లోకి విలీనం చేసే ముందు చెన్నైలోని ప్రసాద్ ల్యాబ్ దగ్గరలో ఎంతో ఖరీదైన ప్రాపర్టీని అమ్మి తన అప్పులు మొత్తం తీర్చారని అప్పులు తీర్చిన తర్వాతే ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లోకి విలీనం చేశారని ప్రసాద్ పేర్కొన్నారు. అయితే ఈ విషయాన్ని చిరంజీవి ఎక్కడ ప్రస్తావించలేదు. ఆయనని ఎవరు ఏమైనా అంటే ఏ మాత్రం బాధపడరు కానీ తన గురించి ఎవరైనా మాట్లాడితే పవన్ కళ్యాణ్ ఏ మాత్రం సహించరని ఎన్వీ ప్రసాద్ పేర్కొన్నారు.ఇలా ప్రజారాజ్యం బాధ నుంచి పుట్టినదే జనసేన అంటూ ఈ సందర్భంగా ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.