‘అదిరింది’కి కాలం చెల్లింది.. అందుకే చమ్మక్ చంద్ర అక్కడికి జంప్

Chammak Chandra In Star Maa Comedy Stars New show

జబర్దస్త్ షోలో చమ్మక్ చంద్ర తిరుగులేని స్టార్డం. చమ్మక్ చంద్ర స్కిట్లను ప్రతీ ఒక్కరూ ఎంజాయ్ చేసేలానే ఉంటాయి. ఎందుకంటే చమ్మక్ చంద్ర తీసుకునే పాయింట్ మొగుడు పెళ్లాం. ప్రతీ ఇంట్లో ఉండే సమస్యలు, సరదాలు, ప్రేమలు, చిరుబుర్రుల మీదే స్కిట్లు వేస్తుంటాడు. అలా ఆ జోకులు, సెటైర్లు అందరికీ కనెక్ట్ అవుతుంటాయి. అయితే జబర్దస్త్ మొత్తంలో టీం లీడర్లందరిలోనూ చమ్మక్ చంద్రకే అత్యధిక పారితోషికం వస్తుందనే టాక్ ఉంది. అయితే అలాంటి స్థానంలో ఉన్న చమ్మక్ చంద్ర నాగబాబు కోసం అదిరిందిలోకి వచ్చాడు.

Chammak Chandra In Star Maa Comedy Stars New show
Chammak Chandra In Star Maa Comedy Stars New show

అదిరింది షోలోనూ చమ్మక్ చంద్రకు అలానే పారితోషికం ఇచ్చారని టాక్. కొన్ని రోజులుగా బాగానే నడిచింది. అదిరిందిని బొమ్మ అదిరిందిగా మార్చారు. అక్కడి వరకు కూడా బాగానే ఉంది. కానీ కొన్ని రోజులు తరువాత బొమ్మ అదిరింది కూడా చెప్పా పెట్టకుండా మాయమైంది. బొమ్మ అదిరింది నాలుగైదు ఎపిసోడ్‌లు కూడా రాలేదు. దెబ్బకు బిచానా సర్దేసింది. అలా బొమ్మ అదిరింది మాయం అవ్వడంతో ఎంతో మంది రోడ్డున పడ్డారు. అటు మళ్లీ ఈ టీవీలోకి వెళ్లలేక జీలో ఆఫర్లు లేక సతమతమయ్యారు.

అలాంటి సమయంలోనే స్టార్ మా మళ్లీ కనికరించింది. చమ్మక్ చంద్రకు స్టార్ మా అవకాశం ఇచ్చింది. జబర్దస్త్ షో నుంచి బయటకు రావడంతో అక్కడ మళ్లీ నో ఎంట్రీ అనే బోర్డ్ కనిపిస్తుంది. ఇలా జీ తెలుగులో బొమ్మ అదిరింది బెడిసి కొట్టడంతో అక్కడ నో వెకెన్సీ బోర్డ్ ఉన్నట్టుంది. ఇప్పుడు స్టార్ మా కొత్త షోతో ప్రయోగం చేసేందుకు సిద్దమైంది. ఇందులో చమ్మక్ చంద్రను స్పెషల్‌గా తీసుకున్నట్టున్నాడు. కామెడీ స్టార్స్ అంటూ శేఖర్ మాస్టర్, హీరోయిన్ శ్రీదేవీ, వర్షిణి, అవినాష్, అరియానా వంటి వారితో కలిసి చేస్తోన్న షోలో చమ్మక్ చంద్ర దర్శనమిచ్చాడు.