అవకాశం అడిగితే అవమానించారు.. క్యాస్టింగ్ కావచ్చు గురించి కామెంట్స్ చేసిన జబర్దస్త్ బ్యూటీ!

జబర్దస్త్ కార్యక్రమం మొదట్లో ఎలాంటి లేడీ కమెడియన్స్ లేకుండా కేవలం మగవారు మాత్రమే స్కిట్లు చేసేవారు. అయితే రాను రాను ఈ కార్యక్రమంలో కూడా లేడీ కమెడియన్స్ ఎంట్రీ ఇవ్వడంతో ఈ కార్యక్రమం కాస్త కలర్ ఫుల్ గా మారిపోయింది.ఇలా జబర్దస్త్ కార్యక్రమంలో ప్రస్తుతం ఎంతోమంది లేడీ కమెడియన్స్ ఉన్నప్పటికీ ఈ కార్యక్రమానికి చమక్ చంద్ర టీం ద్వారా ఎంట్రీ ఇచ్చిన మొట్టమొదటి ఆర్టిస్ట్ సత్య శ్రీ అని చెప్పాలి. ఈమె చమ్మక్ చంద్ర స్కిట్ ద్వారా ఎంతో ఫేమస్ అయ్యారు.

తనకు జబర్దస్త్ లో అవకాశం కల్పించిన చమ్మక్ చంద్ర గారిని తన గురువుగా భావిస్తున్నానని అయితే తన గురువు ఎక్కడ ఉంటే తాను కూడా అక్కడే ఉంటామని తన టీమ్ మొత్తం జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలి వెళ్లామని సత్య శ్రీ ఓ ఇంటర్వ్యూ సందర్భంగా తెలిపారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా సత్య శ్రీ మాట్లాడుతూ కెరియర్ మొదట్లో తాను కూడా ఎన్నో అవమానాలను అనుభవించానని తెలిపారు.అవకాశాల కోసం ఇండస్ట్రీ చుట్టూ తిరిగినప్పుడు చాలామంది నీ మొహానికి యాక్టింగ్ కూడా వచ్చా అంటూ ఎంతో అవమానించారని ఈమె పేర్కొన్నారు.

అయితే అవమానాలకు తాను ఎప్పుడు బాధపడలేదని అవమానాలనే తన విజయానికి సోపానాలుగా మార్చుకున్నానని సత్యశ్రీ వెల్లడించారు. ఇకపోతే ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమెకు క్యాస్టింగ్ కౌచ్ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.అయితే తనకు ఇండస్ట్రీలో ఏ విధమైనటువంటి క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు ఎదురు కాలేదని తన తల్లి కూడా ఇండస్ట్రీలో ఉండటమే కాకుండా తన అమ్మమ్మకి రాజకీయాలలో మంచి పలుకుబడి ఉండటం వల్ల తాను అలాంటి ఇబ్బందులను ఎదుర్కోలేదని సత్య శ్రీ వెల్లడించారు. అయితే తనకు జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు వచ్చిందని, తిరిగి జబర్దస్త్ కార్యక్రమంలో అవకాశం వస్తే తాను తప్పకుండా చేస్తానని సత్య శ్రీ వెల్లడించారు.