ఢీ షో కి దూరం కావటానికి అదే కారణం.. అసలు విషయం చెప్పిన శేఖర్ మాస్టర్?

టాలీవుడ్ ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మొదట ఢీ షో ద్వారా డాన్స్ మాష్టర్ గా ప్రేక్షకులకు పరిచయమైన శేఖర్ మాస్టర్ మళ్లీ అదే షో కి జడ్జ్ గా చాలా కాలం వ్యవహరించాడు. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో సినిమా మొదలైందంటే చాలు కచ్చితంగా శేఖర్ మాస్టర్ ఆ సినిమాకి డాన్స్ కొరియోగ్రాఫర్ గా పని చేయాల్సిందే. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన ఎన్నో పాటలు సూపర్ హిట్ అయ్యాయి. శేఖర్ మాస్టర్ అందించే సిగ్నేచర్ స్టెప్స్ కూడా బాగా పాపులర్ అయ్యాయి. అయితే శేఖర్ మాస్టర్ కి ఇంతటి గుర్తింపు లభించటానికి కారణం ఢీ షో.

ఈ ఢీ షో ద్వారానే శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. ఇక ఢీ షో లో శేఖర్ మాస్టర్ జడ్జ్ గా వ్యవహరించే సమయంలో ఈ షో చూడటానికి ప్రేక్షకులు ఆసక్తి చూపే వారు. ఢీ షో లో శేఖర్ మాస్టర్ తో పాటు ప్రదీప్ యాంకరింగ్, సుధీర్, రష్మి ఫన్నీ స్కిట్ ల వల్ల కూడా ఈ షో ఒకప్పుడు టాప్ రేటింగ్స్ తో దూసుకుపోయింది. అయితే ప్రస్తుతం శేఖర్ మాస్టర్, సుధీర్, రష్మి కూడా ఈ షో కి దూరమయ్యారు. దీంతో ఢీ రేటింగ్స్ పడిపోయి ఈ షో పరిస్తితి దారుణంగా తయారయ్యింది. అంతే కాకుండ ఈ షో లో ప్రియమణి తప్ప పర్మినెంట్ జడ్జి లు ఎవరూ లేరు.

అయితే శేఖర్ మాస్టర్ ఢీ షో కి దూరం కావటానికి కారణం ఏమిటి అని అందరూ అనుమాన పడుతున్నారు. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శేఖర్ మాస్టర్ ని యాంకర్స్ ఈ విషయం గురించి అడగగా… సినిమా అవకాశాలు ఎక్కువ రావటం వల్ల అక్కడ ఇక్కడ మేనేజ్ చేయడానికి డేట్స్ కుదరకపోవడంతో ఢీ షో కి దూరమయ్యానని శేఖర్ మాస్టర్ క్లారిటీ ఇచ్చారు. అయితే ఢీ షో మానేసిన తర్వాత శేఖర్ మాస్టర్ మాటీవీలో ప్రసారమైన కామెడీ స్టార్స్ అనే షోలో సందడి చేశారు. ఆ విషయం గురించి యాంకర్ ప్రస్తావించగా.. కామెడీ స్టార్స్ షో కి అగ్రిమెంట్ చేయడం వల్ల నేను ఆ షోలో జడ్జిగా వ్యవహరించానని శేఖర్ మాస్టర్ వెల్లడించారు. అయితే ఢీ అభిమానులు మాత్రం శేఖర్ మాస్టర్ మళ్ళీ ఈ షో కి తిరిగి రావాలని కోరుకుంటున్నారు.