శ్రీలంకలో సందడి చేసిన జబర్థస్త్ శ్రీ సత్య… వైరల్ అవుతున్న వీడియో…!

ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో కొంతకాలం సిద్ధం వరకు కేవలం పురుషులకు మాత్రమే పరిమితమైంది. కానీ రోజులు మారే కొద్ది మహిళలు కూడా జబర్దస్త్ షోలో సందడి చేస్తున్నారు. ఇలా జబర్దస్త్ ద్వారా గుర్తింపు పొందిన లేడీ కమెడియన్లలో శ్రీ సత్య కూడా ఒకరు. చమ్మక్ చంద్ర టీం లో మెయిన్ రోల్ లో కనిపించే శ్రీ సత్య చమ్మక్ చంద్ర టీం లో మాత్రమే చేస్తూ అతనికి భార్యగా ఎన్నో స్కిట్లు చేసింది. ఇలా జబర్దస్త్ వల్ల శ్రీ సత్య మంచి గుర్తింపు ఏర్పరచుకుంది.

అయితే చమ్మక్ చంద్ర జబర్దస్త్ షో కి దూరమైనప్పుడు శ్రీ సత్య కూడా చంద్ర లాగే జబర్దస్త్ కి దూరమయ్యింది. ఆ తర్వాత స్టార్ మా లో ప్రసారం అవుతున్న కామెడీ స్టార్స్ అనే షోలో సందడి చేస్తోంది. ఇలా జబర్దస్త్ ఆర్టిస్ట్ గా గుర్తింపు పొందిన శ్రీ సత్య ఇటీవల శ్రీలంకలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో హోస్ట్ గా వ్యవహరించింది. ఈ కార్యక్రమానికి అనసూయ తన భర్తతో కలిసి హాజరవ్వగా కండక్టర్ ఝాన్సీ కూడా ఈ షోలో పాల్గొనింది.

శ్రీ సత్య ఇలా జబర్దస్త్ ఆర్టిస్ట్ గా గుర్తింపు పొందిన తర్వాత అనేక సినిమాలలో కూడా నటించే అవకాశాలు అందుకుంది. ఇలా సినిమాలలో అవకాశాలు అందుకోవటమే కాకుండా ఇప్పుడు హోస్ట్ గా మారి తన టాలెంట్ నిరూపించుకుంటుంది. ఈ కార్యక్రమంలో అనసూయతో కలిసి దిగిన ఫోటోలను సత్య సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇలా ఈ ఫోటోలతో పాటు ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.