సద్దాం టీమ్ నుంచి తప్పకుండా కమెడియన్ రియాజ్.. అలా తన బాధను బయటపెట్టిన సద్దాం..!

బుల్లితెరపై ఎన్నో కామెడీ షోస్ ప్రసారమవుతు పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నాయి.ఈ క్రమంలోనే ఎంతోమంది ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఇండస్ట్రీకి పరిచయమై ప్రస్తుతం సెలబ్రెటీలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఇలాంటి వారిలో సద్దాం, గల్లీ బాయ్ రియాజ్, యాదమ్మ రాజు వీళ్ళందరూ కూడా కార్యక్రమం ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వాళ్ళే. ఈ కార్యక్రమంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన వీళ్ళందరూ అదిరింది, బొమ్మ అదిరింది అనే కామెడీ షో లలో సందడి చేశారు.కొంతకాలానికి ఈ కార్యక్రమం మూతపడటంతో తిరిగి వీరందరూ కామెడీ స్టార్స్ కార్యక్రమంలో సందడి చేస్తున్నారు.

ఈ క్రమంలోనే సద్దామ్ టీం నుంచి గల్లీ బాయ్ రియాజ్ బయటకు వెళ్లిపోవడంతో తాను ఎంతో బాధపడినట్లు ఒక స్కిట్ రూపంలో తెలియజేశారు. ఇలా బయటికి వెళ్లిన రియాజ్ తిరిగి రావడంతో సద్దాం తన బాధను స్కిట్ రూపం ద్వారా బయటపెట్టారు. పుష్ప స్పూప్‌ను సద్దాం వేశాడు. అందులో పుష్పగా సద్దాం, షెకావత్‌గా రియాజ్ నటించాడు. తన టీం వదిలి మీరు వేరే టీంలోకి వెళ్లారు. మీరు నన్ను హట్ చేశారు సార్ అంటూ సద్దాం పుష్ప మేనరిజంలో డైలాగ్ చెప్పారు.

నిన్ను నేను పైకి తీసుకు వచ్చాను నా టీంలో నీకు అవకాశం ఇచ్చాను ఇలా నీ ఎదుగుదలకు ఇంత ప్రోత్సహిస్తే నువ్వు నన్ను వదిలి వేరే టీమ్ లోకి వెళ్తావా… నేను రెండు నెలల పాటు ఇంట్లో కూర్చుని మీకోసం ఎంత బాధ పడ్డానో సర్ అంటూ షెకావత్ పుష్ప సీన్‌ను రిపీట్ చేశాడు. మొత్తానికి రియాజ్ సద్దాం టీం నుంచి వెళ్లిపోవడంతో ఆయన గ్రాఫ్ పూర్తిగా పడిపోయిందని అర్థమవుతుంది ఏది ఏమైనా రియాజ్ వెళ్లిపోవడంతో తన టీం పట్టు కోల్పోయిందని అర్థమవుతుంది.తిరిగి రియాజ్ తన టీమ్ లోకి రావడంతో ఇలా రియాజ్ లేనప్పుడు సద్దాం ఎలాంటి ఫ్రస్టేషన్ కు గురయ్యారో ఈ విధంగా బయటపెట్టినట్లు తెలుస్తోంది.