సెల‌బ్రిటీ వార్: మూతి బిగించిన భార్యామ‌ణి..అలక‌పానుపెక్కిన భ‌ర్త‌!

ఏ భార్యా భ‌ర్త‌ల మ‌ధ్య మ‌న‌స్ప‌ర్ధ‌లు త‌లెత్త‌వు. ఈగోలు ఎవ‌రికుండ‌వు. హ‌ర్ట్ కాక‌పోవ‌డానికి అతీతులెవ‌రు. నొచ్చుకోక పోవ‌డానికి మ‌నుషులేమి రోబోలు కాదుగా! కోపాలు..తాపాలు..విర‌హాలు..ఆవేశాలు మ‌నిషికి స‌హ‌జం. భార్య‌పై భ‌ర్త ఎగ‌ర‌డం…భ‌ర్త‌పై భార్య ఎగ‌ర‌డం..మూతి బింగుపులు లాంటివి స‌హ‌జ‌మే క‌దా. బ్ర‌తుకు జ‌ట్కా బండి లాండి క‌థ‌లు ఏ ఇంట్లో లేవు. అన్ని ఇళ్ల‌లో అవ‌న్నీ ఎప్ప‌టిక‌ప్పుడు కొలువు దీరుతూనే ఉంటాయి. వాట‌న్నింటిని స‌ర్దుకుంటు ముందుకు సాగిపోవ‌డమే జీవితం. ఆ అర్డ‌ర్ లో ఎక్క‌డా తేడా జ‌రిగినా జీవిత‌మే గంద‌రోళంలో ప‌డుతుంద‌ని పెద్ద‌లంటుంటారు.

celebrity war

తాజాగా టాలీవుడ్ సెల‌బ్రిటీ ఓ పెద్దిటి కుటుంబంలో ఇలాంటి వివాదం ఒక‌టి తెర‌పైకి వ‌చ్చింది. అత‌నో స్టార్ హీరో. ఆమె కూడా కొన్ని సినిమాల్లో న‌టించి.. పెళ్లి త‌ర్వాత న‌ట‌న‌కు గుడ్ బై చెప్పింది. ప్ర‌స్తుతం భ‌ర్త‌..పిల్ల‌లు..మామ గారే ఇప్పుడామె లోకం. వాళ్ల ఆల‌నా పాల‌నా చూసుకుంటూ జీవితాన్ని ఆస్వాదిస్తోంది. అస‌లైన జీవితం అంటే ఇది! అని ఆమె చాలాసార్లు చెప్పింది. అయితే అలాంటి భార్య ఇప్పుడు భ‌ర్త‌ని చూసి మూతి బిగిస్తోందిట‌. చీటికి…మాటికి చిరాకు ప‌డుతుందిట‌. కార‌ణాలు ఏంటి? అని అరా తీయ‌గా ఆస‌క్తిక‌ర సంగ‌తులే తెలిసాయి. వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా పూజా కార్య‌క్ర‌మాలు ముగిసిన అనంత‌రం వినాయ‌కుడ్ని యాథావిధిగా భ‌ర్త ఆరోజు సాయంత్ర‌మే నిమ‌జ్జ‌నం చేయ‌మ‌న్నాడుట‌.

దానికి ఆ భార్య ఒప్పుకోలేదుట‌. మూడు రోజుల త‌ర్వాత ఆ కార్య‌క్ర‌మం చేద్దాం అందిట‌. అందుకు భ‌ర్త అందేంటి? ప‌్ర‌తీ ఏడాది ఆ రోజు సాయంత్ర‌మే కానిచ్చేస్తాం గా! కొత్త‌గా మూడు రోజుల వ‌ర‌కూ ఇంట్లో పెట్ట‌డం ఏంట‌ని క‌సురుకున్నాడుట‌. దీంతో ఆ భార్య తెగ ఫీలైందిట‌. ఎప్పుడూ ప‌ల్లెత్తు మాట అన‌ని భ‌ర్త కాస్త సీరియ‌స్ లుక్ ఇచ్చేస‌రికి మూతి బిగించి బెడ్ రూమ్ లోకి వెళ్లి వ‌ల‌వ‌లా ఏడ్చేసిందిట‌. ఆ విష‌యాన్ని సీరియ‌స్ గా తీసుకొని ఆ భ‌ర్త త‌న త‌ప్పేం లేద‌ని భావించి బ‌య‌ట‌కు వెళ్లి సాయంత్రానికి ఇంటికి చేరుకున్నాడుట‌. అప్ప‌టికీ ఆ భార్య బెడ్ రూమ్ లో నే క‌న్నీళ్లు పెట్టుకుని ఉందిట‌. క‌ళ్ల‌నీ ఎర్ర‌గా కందిపోయి ఉన్నాయ‌ట‌.

ఈ స‌న్నివేశం చూసిన ఆ భ‌ర్త కాసేపు  బుజ్జ‌గించే ప్ర‌య‌త్నం చేసాడుట‌. దాదాపు గంట‌పాటు కాకా ప‌ట్టే ప్ర‌య‌త్నం చేసాడుట‌. అయినా ఆ భ‌ర్య మ‌న‌సు క‌ర‌గ‌లేదంట‌. చివ‌రికి విసుగెత్తి ఆ భ‌ర్త కూడా రివ‌ర్స్ గేర్ వేసి అల‌క పానుపెక్కాడ‌ట‌. ఆ త‌ర్వాత కాసేప‌టికి రాజీకొచ్చారుట‌. స‌మ‌స్య స‌మ‌సిపోయేలా చేసుకున్నారుట‌. అదీ సంగ‌తి. చూసారా! మ‌న‌సు నొచ్చుకుంటే ప‌రిస్థితి ఎలా ఉంటుందో.