ఆలోచించిన ఆశాభంగం.. స్టార్ హీరో ఇంట్లో ఉండే అవ‌కాశం మిస్ కావొద్దు

ఒక్కోసారి బంపర్ ఆఫ‌ర్స్ అరుదుగా వ‌స్తుంటాయి. వాటిని మిస్ చేసుకుంటే బాధ‌ప‌డ‌డం ఖాయం. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్, ఆయ‌న భార్య గౌరీ ఖాన్‌లు ఇద్ద‌రికి బంపర్ ఆఫ‌ర్ ఇస్తున్నారు. ఆ ఆఫ‌ర్ ఏంటో తెలిస్తే నోరెళ్ల‌పెట్ట‌డం ఖాయం. వివ‌రాల‌లోకి వెళితే షారూఖ్ భార్య గౌరీ ఖాన్ గొప్ప డిజైనర్ అన్న సంగ‌తి మ‌నంద‌రికి తెలిసిందే. చాలా మంది టాప్ సెల‌బ్రిటీల ఇళ్ళ‌కు ఆమె డిజైన‌ర్ గా ప‌నిచేశారు. అద్భుత‌మైన ఫినిషింగ్ కూడా ఇచ్చారు.

షారుక్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ స్వ‌యంగా రీడిజైన్ చేసిన ఇల్లు ఒక‌టి ఢిల్లీలో ఉంది. ఈ ఇంటిని అద్భుతంగా డిజైన్ చేసి ఉంటుంది. అయితే ఈ ఇంట్లో ఉండే అవ‌కాశం క‌ల్పిస్తుంది. ఎయిర్‌బీఎన్‌బీ అనే హోమ్ రెంట‌ల్ స‌ర్వీస్‌. ఇద్ద‌రు షారూఖ్ ఖాన్ ఇంట్లో ఉండే అవ‌కాశం క‌లిపిస్తున్న‌ట్టు వారు పేర్కొన్నారు. బుధ‌వారం ఈ సెల‌బ్రిటీ క‌పుల్.. త‌మ ఇంటి వీడియోను సోష‌ల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తూ విష‌యాన్ని వెల్ల‌డించింది

పంచ్ షీల్ పార్క్‌లో ఉన్న పార్క్‌తో త‌మ‌కు ప్ర‌త్యే అభిమానం ఉంద‌ని షారూఖ్ చెబుతుండ‌గా, ఇద్ద‌రు అదృష్ట వంతులెవ‌రో తేల్చుకోవాల‌ని గౌరీ ఖాన్ అంటుంది. త్వ‌ర‌లో గౌరీ మై లైఫ్ ఇన్ డిజైన్ పేరుతో ఓ పుస్త‌కం కూడా విడుద‌ల చేయ‌నుంది. ఇక షారూఖ్ ఇటీవ‌ల దుబాయ్ నుండి తిరిగి రాగా, ప్ర‌స్తుతం కొన్ని క‌థ‌లు వింటున్న‌ట్టు తెలుస్తుంది. జీరో సినిమా త‌ర్వాత మ‌రో క‌థ‌కు ఓకె చెప్ప‌ని బాద్ షా త్వ‌ర‌లో అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో క్రేజీ ప్రాజెక్ట్ చేయ‌నున్న‌ట్టు స‌మాచారం.