భర్తలను మార్చడంపై బిజెపి రాజాసింగ్ సీరియస్ (వీడియో)

తెలంగాణ సర్కారు నిర్లక్ష్య వైఖరిని బిజెపి నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ సీరియస్ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం తక్షణమే ఈ ఘటనపై స్పందించాలని డిమాండ్ చేశారు. దీనికి బాధ్యులైన అధికారులపై తక్షనం చర్యలు తీసుకోవాలన్నారు. ఆ మహిళకు, ఆ కుటుంబానికి భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 

తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన పత్రికా ప్రకటనల విషయంలో ఒక మహిళ ఫొటోకు వేరు వేరు వ్యక్తులు భర్తలు అన్నట్లుగా యాడ్స్ రూపొందించింది. దీనిపై పెద్ద దుమారం చెలరేగింది. దీంతో ఆ కుటుంబం మీడియా ముందుకు వచ్చి తమను అవమానించారని కన్నీరు మున్నీరయ్యారు. 

ఈ నేపథ్యంలో తెలంగాణ ఆడబిడ్డను అవమానించిన వారిని సర్కారు వదిలి పెట్టొద్దని బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు రాజాసింగ్ ఒక వీడియోను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. రాజా సింగ్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఆయన ఏమన్నారో కింద వీడియో ఉంది చూడండి.

తమ కుటుంబానికి జరిగిన అవమానంపై యాడ్ ఫొటోలో ఉన్న మహిళ స్పందించారు. తెలంగాణ సర్కారు చేసిన నిర్వాకం కారణంగా తాము తలెత్తుకోలేని దుస్థితిలో ఉన్నట్లు చెప్పారు. తమను నవ్వులపాలు చేశారని ఏడుస్తూ చెప్పిన ఆ మహిళ ఆవేదన ఏంటో కింద వీడియోలో ఉంది చూడండి.