బడి పంతులు, భార్య మధ్యలో ఆంటీ… (వీడియో)

ఆయన పిల్లలకు పాఠాలు భోధించి వారిని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే స్థానంలో ఉన్న మనిషి. బడి పిల్లలకు ఆదర్శంగా నిలవాల్సిన ఆ గురువు చేసిన నిర్వాకం రాజన్న సిరిసిల్ల జిల్లాలో చర్చనీయాంశమైంది. ఆదర్శంగా ఉండాల్సిన పంతులు చేసిన గలీజు పని తెలుసుకుని జనాలు ముక్కు మీద వేలేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఆ పంతులు చేసిన పనికి భార్య తాలూకు మనుషులు ఆయనకు గట్టిగానే దేహశుద్ధి చేశారు. పూర్తి వివరాలు వీడియో కింద ఉన్నాయి.

రాజన్న సిరిసిల్ల జిల్లా చెక్కపల్లి గ్రామంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు గా పని చేస్తున్నాడు సత్యనారాయణ. ఆయనకు పద్మ అనే భార్య ఉన్నారు. ఆమె ఉంగానే ఈ పంతులు సంధ్య అనే మరో మహిళతో వివాహేతర సంబంధం నడుపుతున్నారు. ఈ విషయం తెలిసిన భార్య పద్మ రగిలిపోయింది. మహిళా సంఘాలు, తన బంధువులను వెంట పెట్టుకుని సంధ్య ఇంటికి వెళ్లింది. భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని దేహశుద్ధి చేశారు. మహిళా సంఘాలు, బంధువులు కలిసి సత్యనారాయణ, సంధ్య లపై దాడికి దిగారు. ఒళ్ళు హూనం చేశారు.. కుళ్ళా బొడిచారు. 

ఏం చేస్కుంటావో చేస్కో : సంధ్య

ఇక్కడ మరో ట్విస్ట్ ఏందంటే ప్రస్తుతం సత్యనారాయణ  వివాహేతర సంబంధం నడుపుతున్న సంధ్య అనే మహిళ ఇప్పుడు గర్భవతి. ఆమె పద్మ మీద ఫైర్ అయ్యారు. తనతో సంబంధం ఉన్న విషయం పద్మకు ముందే తెలుసు అంటున్నారు. అయినా తాను గర్భవతి అయిన తర్వాత ఇప్పుడు రచ్చ చేసి తమపై దాడి చేశారని ఆమె అంటున్నది. పద్మ ఏం చేసుకున్నా సత్యనారాయణను తాను విడిచిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి పారేసింది సంధ్య.

దీంతో ఈ కేసు మరింత క్లిష్టంగా మారింది. మరి సత్యనారాయణ సంధ్యను రెండో పెళ్లి చేసుకున్నారా లేదా అన్న వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.