“ఆదిపురుష్” ట్రైలర్ పై బాలీవుడ్ రిపోర్ట్స్ టాక్.!

ప్రస్తుతం పాన్ ఇండియా మార్కెట్ లో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మాసివ్ జెయింట్ సినిమా “ఆదిపురుష్”. ఈ జూన్ 16న రిలీజ్ కి సిద్ధంగా ఉన్న ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించగా దర్శకుడు ఓంరౌత్ అయితే తెరకెక్కించాడు. మరి మన దేశ చరిత్ర రామాయణం ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమాపై మొదట్లో ఉన్న ఎన్నో అంచనాలు టీజర్ తో అయితే తప్పిపోయాయి.

కానీ తర్వాత మేకర్స్ మళ్ళీ గ్యాప్ అయితే తీసుకొని కొత్త వెర్షన్ ని సిద్ధం చేశారు. గ్రాఫిక్స్ ని కొద్దిగా ఇంప్రూవ్ చేసి అయితే తీసుకొస్తున్నారు. మరి ఇప్పుడు అయితే బాలీవుడ్ సినీ వర్గాల నుంచి కొన్ని ఇంట్రెస్టింగ్ రిపోర్ట్స్ అయితే వినిపిస్తున్నాయి. దీని ప్రకారం ఈ సినిమా 3డి ట్రైలర్ సుమారు 3 నిమిషాల కంటే ఎక్కువ కట్ చేయగా.

ఇది 3డి లో అదిరే ట్రీట్ ఇచ్చేలా ఉందని భారీ విజువల్స్ తో మంచి ట్రీట్ ఇస్తుంది అని అంటున్నారు. అలాగే ఈ ట్రైలర్ ని అయితే మేకర్స్ ఈ మే నెలలో రిలీజ్ చేస్తున్నట్టుగా బీ టౌన్ వర్గాలు చెప్తున్నాయి. మరి ఈ ట్రైలర్ కి అయితే ప్రస్తుతం పాజిటివ్ రిపోర్ట్స్ వినిపిస్తున్నాయి.

మరి రిలీజ్ అయ్యాక చూస్తే గాని అసలు విషయం ఏంటి అనేది క్లారిటీ రాదు. ఇక ఈ భారీ సినిమాలో ప్రభాస్ రామునిగా కృతి సనన్ సీతగా సైఫ్ అలీ ఖాన్ రావణ పాత్రలో నటించగా సోనాల్ చౌహన్, సన్నీ సింగ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అలాగే ఈ సినిమా 3డి తో పాటుగా 4డిఎక్స్, సహా ఇంగ్లీష్ రిలీజ్ కూడా కానున్నట్టుగా తెలుస్తుంది.