నన్ను ఎందుకు ఇలా టార్చర్ చేస్తున్నారంటూ కన్నీటిపర్యంతమైన బిగ్ బాస్ బ్యూటీ..!

తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న బిగ్ బాస్ కార్యక్రమానికి ఎంతో ప్రేక్షకాదరణ లభిస్తుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం తెలుగులో ఈ కార్యక్రమం ఐదవ సీజన్ ప్రసారమవుతుంది. ఇదిలా ఉండగా బిగ్ బాస్ సీజన్ ఫోర్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గర అయిన కంటెస్టెంట్ మోనాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఎన్నో సినిమాలలో నటించి బిగ్ బాస్ కంటెస్టెంట్ గా వెళ్లారు. బిగ్ బాస్ హౌస్ ద్వారా మోనాల్ ఎంతో పేరు ప్రఖ్యాతులను సంపాదించుకుంది.

Monal | Telugu Rajyamబిగ్ బాస్ తర్వాత మోనాల్ ఎన్నో అవకాశాలను అందుకుంటూ కెరీర్లో ఎంతో బిజీగా ఉన్నారని చెప్పవచ్చు.బిగ్ బాస్ హౌస్ లో అఖిల్ అభిజిత్ తో ఎంతో చనువుగా ఉంటూ లవ్ ట్రాక్ లో నడిపిన ఈమెకు బయట అదే స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఇక కెరీర్లో ఎంతో బిజీగా ఉండటమే కాకుండా సోషల్ మీడియా వేదికగా నిత్యం అభిమానులకు ఎంతో దగ్గరగా ఉంటూ వారితో మాట్లాడుతూ అభిమానులను సందడి చేస్తుంటారు.

ఇలా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే ఈ గుజరాతి బ్యూటీ తాజాగా హైదరాబాద్ లో ఇంటిని కొనుగోలు చేసి హైదరాబాద్ కి తన మకాం మార్చినట్లు తెలుస్తోంది. ఈ సమయంలోనే కొందరు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా మోనాల్ ను ఉద్దేశిస్తూ డ్రామా క్వీన్ అంటూ ఆమెను మానసికంగా ఎంతో కృంగదీసే కామెంట్లు చేశారు.ఈ క్రమంలోనే ఈ కామెంట్లపై మోనాల్ స్పందిస్తూ నన్ను ఎందుకు ఇలా టార్చర్ చేస్తున్నారంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లకు భారీ కౌంటర్ ఇచ్చారు.నాకు ఒక ఫ్యామిలీ ఉంది నన్ను ఎందుకు ఇలా టార్చర్ చేస్తున్నారు. మీకు నన్ను ఫాలో అవ్వడం ఇష్టం లేకపోతే అన్ ఫాలో కండి నాన్సెన్స్ పీపుల్ ఇది నా జీవితం నా జీవితం గురించి మాట్లాడటానికి మీరెవరు అంటూ సోషల్ మీడియా వేదికగా కాస్త ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles