Fish Venkat Death: టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా విలన్ గా కమెడియన్ పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించిన వారిలో ఫిష్ వెంకట్ ఒకరు. ఆది సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన ఫిష్ వెంకట్ అనంతరం టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు అందరి సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇలా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించిన ఈయన గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ సినిమాలకు దూరంగా ఉన్నారు.
ఈ విధంగా ఫిష్ వెంకట్ సినిమాలకు దూరంగా ఉన్న నేపథ్యంలో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు వెంటాడాయి. ఇలా ఆర్థిక ఇబ్బందుల కారణంగా సరైన వైద్యం కూడా చేయించుకోలేని స్థితిలో ఫిష్ వెంకట్ ఉండిపోయారు. ఈయన ఆరోగ్య పరిస్థితి తెలిసి గతంలో పవన్ కళ్యాణ్ ఈయనకు రెండు లక్షల రూపాయలు ఇచ్చారు. అయితే తన ఫ్రెండ్ కిడ్నీలు పూర్తిగా పాడవడంతో ఎంతో ఇబ్బంది పడుతున్న ఈయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. ఇటీవల హైదరాబాద్ లో ఒక ప్రవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఫిష్ వెంకట్ మరణించారు.. అయితే తనని కాపాడాలి అంటూ తన కుటుంబ సభ్యులు సినిమా ఇండస్ట్రీని కోరారు అయితే ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలలో నటించిన ఈయనకు ఏ ఒక్క హీరో కూడా సహాయం చేయటానికి ముందుకు రాలేదు.
కనీసం నేనున్నా అంటూ భరోసా కూడా ఇవ్వలేకపోయారు. కేవలం విశ్వక్ సేన్ వంటి వారు మాత్రమే రెండు లక్షల రూపాయల విరాళం అందించి సహాయం చేశారు ఇలా ఈయన చిన్న హీరో అయినా గొప్ప మనసు చాటుకున్నారు. ఇక పాన్ ఇండియా హీరోలుగా చలామణి అవుతూ ఒక్కో సినిమాకు వందల కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ఏ ఒక్క హీరో కూడా ఈయన ఆరోగ్యం పై స్పందించకపోవడంతో అభిమానులు టాలీవుడ్ ఇండస్ట్రీపై అలాగే హీరోలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేరుకే వీరంతా హీరోలు కానీ మనసులేని బండరాయిలు అంటూ టాలీవుడ్ స్టార్ హీరోలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
