బిగ్‌బాస్ రియాలిటీ షో చూస్తున్నారా..? చూడనివాళ్లు కూడా ఇప్పుడు ట్రాక్‌లోకి వచ్చారు. ఎందుకంటే ఇప్పుడు కథ కంచికొచ్చింది. మరో వారంలో విజేత ఎవరో తేలిపోనుంది. దానికి తగ్గట్లే.. బాస్ హౌస్‌లో క్లయిమాక్స్‌కి తగ్గ స్పైస్ కూడా కాస్త ఎక్కవ అవుతుంది. బిగ్ బాస్ ఇంట్లో అయితే పర్లేదు కానీ..ఏకంగా స్టేజ్‌పైన నాగార్జునే హద్దుమీరుతున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రీఆర్‌పీ పెంచేందుకు కాస్త లైన్ క్రాస్ చేస్తున్నారా అనే డౌట్స్ వస్తున్నాయి. క్లయిమాక్స్ ఎపిసోడ్స్ ఇంకాఇంకా రక్తి కట్టించడానికి కొన్ని అడల్ట్ పంచ్ డైలాగులు పేల్చేస్తున్నారు నాగ్. లాస్ట్ వీకెండ్‌లో అరియానా, సొహైల్ గొడవపడ్డప్పుడు.. ఆడదాన్నని కూడా చూడలేదు.. అని ఆమె ఫిర్యాదు చేశారు. దానికి నాగ్ ఇచ్చిన వివరణ కాస్త విడ్డూరంగా అనిపించింది. లేడీ కార్డ్ యూజ్ చేస్తావా.. ఇక్కడ మీదపడి కొట్టుకున్నా.. తిట్టుకున్నా. ఆడామగా తేడా లేదు అంటూ కాస్త షాకింగ్ కామెంట్స్ చేశారు.
సరే..ఈ విషయంలో నిర్వాహకులు పెట్టిన రూల్స్ ప్రకారం వెళ్లారు అనుకుందాం. అదే ఎపిసోడ్‌లో నాగ్ ఇచ్చిన అడల్ట్ పంచ్ కూడా ఇప్పుడు చర్చనీయాంశమైంది. పిల్లలు ఎలా పుడతారు అనేది. వీక్‌డేస్‌లో టాస్క్ మధ్యలో అభిజిత్, మోనాల్‌ను అడిగిన ప్రశ్న. షోలోనే కాస్త అతి ప్రశ్న అనుకుంటే.. వీకెండ్‌లో మరోసారి అదే ప్రశ్న రైజ్ చేశారు నాగార్జున. ఏడుస్తూ పుడతారు అంటూ పెద్దగా పేలని జోక్ వేశారు. ఇవన్ని స్క్రిప్టింగ్‌లో భాగంగానే జరుగుతున్నాయి. ఎంత ఎవర్‌గ్రీన్ మన్మథుడు అయినా, ఫ్యామిలీ ఫాలోయింగ్ ఉన్నా..ఈ తరహా ప్రవర్తన కరెక్ట్ కాదన్నది పలువరి వాదన. 60 ఏళ్ల దాటిన నాగార్జునతో ఈ తరహా కామెంట్లు చేయించడం పట్ల కొందరు బాహాటంగానే విమర్శిస్తున్నారు.
ఇప్పటివరకు అదిరిపోయే హోస్టింగ్ తో ఆకట్టుకున్న నాగార్జున..మరో వారంలో షో అయిపోతుందనగా..ఈ తరహా కామెంట్స్ చేసి బ్యాడ్ అవ్వడం ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. వాళ్లదేముంది..హోస్టులను మార్చేసుకుంటూ ఉంటారు…అందునా నార్త్ జనాలు. మనవాళ్లు అడల్ట్ కంటెంట్ ఎక్కువఉంటే ఒప్పుకోరు. వీటిని మైండ్‌లో పెట్టుకుని ముందుకెళ్తే బెటర్ అని నాగ్‌కు ఉచిత సలహాలు ఇస్తున్నారు మరికొందరు.