బిగ్ అప్డేట్ : “ఆదిపురుష్” ప్రీరిలీజ్ ఈవెంట్ ఎప్పుడు, ఎక్కడంటే.!

ఇప్పుడు పాన్ ఇండియా వీక్షకులు అంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అవైటెడ్ పాన్ ఇండియా చిత్రం “ఆదిపురుష్”. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మళ్ళీ బాహుబలి తర్వాత ఆ రేంజ్ ఉన్న స్పాన్ తో చేసిన ఈ సినిమా రామాయణం ఆధారంగా తెరకెక్కింది.

ఇక ఈ అవైటెడ్ సినిమాని దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కించగా రీసెంట్ గా వచ్చిన మొదటి సాంగ్ అలాగే థియేట్రికల్ ట్రైలర్స్ దెబ్బకి సినిమా నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయింది. దీనితో థియేటర్స్ లో ఈ సినిమా చూడాలని చాలా మంది ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక ఇదిలా ఉండగా ఈ మాసివ్ చిత్రంపై అయితే చిత్ర యూనిట్ ఇప్పుడు క్రేజీ అప్డేట్ ని అందించారు.

ఈ సినిమా గ్రాండ్ అండ్ బిగ్గెస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని అయితే లాక్ చేసేసారు. ఇది వరకు వచ్చిన టాక్ ప్రకారమే తిరుపతిలో ఈ ఈవెంట్ ని జరపనున్నట్టుగా మేకర్స్ ఇప్పుడు కన్ఫర్మ్ చేశారు. కాగా ఈ ఈవెంట్ అయితే ఈ జూన్ 6న అత్యంత ఘనంగా నిర్వహించనున్నారు. ఇక ఈ సినిమాతో అయితే ఓ మర్చిపోలేని ట్రీట్ ని అందరికీ అందిస్తామని కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు.

మొత్తానికి అయితే సినిమా నుంచి ఓ అతి పెద్ద అంశంపై మంచి క్లారిటీ వచ్చింది అని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రంలో సైఫ్ అలీఖాన్ రావణ పాత్రలో నటించగా సన్నీ సింగ్ లక్ష్మణునిగా కృతి సనన్ జానకి దేవి పాత్రల్లో నటించారు. అలాగే ఈ జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం గ్రాండ్ గా అయితే రిలీజ్ కాబోతుంది.