బిగ్ న్యూస్ : మహేష్ ని కలిసిన ఏపీ ముఖ్యమంత్రి జగన్..పూర్తి వివరాలు ఇవే.!

టాలీవుడ్ టాప్ హీరోస్ లో ఒకరైన సూపర్ స్టార్ మహేష్ బాబు తండ్రి రియల్ సూపర్ స్టార్ కృష్ణ ఘట్టమనేని గారు నిన్న తెల్లవారు జామున వయసు సంబంధిత సమస్యలతో కన్ను మూసిన సంగతి అందరికీ తెలిసిందే. దీనితో ఘట్టమనేని వారి ఇంత పెను విషాదం చోటు చేసుకోగా ఈరోజు ఇప్పటికీ కూడా ఈ విషాద ఛాయలు కొనసాగుతున్నాయి.

మరి నిన్నటి నుంచి కూడా ఎంతో మంది మహేష్ ని వారి కుటుంబాన్ని కలిసి ధైర్యం చెప్తూ కాసేపు గడిపి వెళ్తూ ఉండగా తాజాగా ఏపీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మెహన్ రెడ్డి మహేష్ ఇంటికి రావడం వైరల్ గా మారింది. అయితే మరిన్ని డీటెయిల్స్ లోకి వెళితే ఈరోజు ఆకస్మికంగా జరిగిన ఈ మీటింగ్ జరగగా ముఖ్యమంత్రి జగన్ తన బృందంతో ఈరోజు నానక్రామ్ గుడా లో మహేష్ ఇంటికి స్వయంగా వెళ్లి పలకరించి ధైర్యం చెప్పారు.

కృష్ణ గారి పార్థివ దేహాన్ని చూసిన జగన్ తర్వాత మహేష్ కుటుంబ సభ్యులతో ముచ్చటించి వారికి ధైర్యం చెప్పారు. దీనితో ఈ ఎక్స్ క్లూజివ్ వీడియో మరియు ఫోటోలు మహేష్ టీం మీడియా వారికి వదిలారు. దీనితో మహేష్ ని జగన్ ఆలింగనం చేసుకొని జగన్ మాట్లాడ్డం వంటివి కనిపిస్తున్నాయి. అలాగే ఈ మీటింగ్ సుమారు 10 నుంచి 15 నిమిషాల పాటు జరిగినట్టుగా తెలుస్తుంది.