ఇప్పుడు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆంధ్ర రాష్ట్ర సార్వత్రిక ఎన్నికలు అయితే రాబోతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ ఎన్నకలకి మళ్ళీ సినిమాతో లింక్ పడింది. గత ఎన్నికల సమయంలో కూడా ఒకో పార్టీ తమని తాము బిగ్స్ స్క్రీన్ మీద ప్రమోట్ చేసుకోడానికి సినిమానే ఎంచుకున్నారు.
ఒకోకరు ఒకో బయోపిక్ తీసి రిలీజ్ చేశారు. అలా గత ఎన్నికల ముందు రిలీజ్ చేసిన చిత్రాల్లో “యాత్ర” కూడా ఒకటి. మళయాళ నటుడు మమ్ముట్టి హీరోగా రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా దర్శకుడు మహి వి రాఘవ తెరకెక్కించిన ఈ చిత్రం అప్పుడు పర్వాలేదనిపించింది.
కాగా ఇప్పుడు మళ్ళీ ఈ ఎన్నికలకి పార్ట్ 2 ని వై ఎస్ జగన్ జీవితాన్ని కూడా కలిపి తెరకెక్కించి రిలీజ్ చేస్తున్నారు కాగా ఇందులో జగన్ పాత్రని తమిళ ప్రముఖ నటుడు జీవా పోషిస్తున్నాడు. మరి ఈ సినిమా నుంచి నిన్న ట్రైలర్ కూడా రాగా ఈ సినిమా విషయంలో ఒక కీలక అప్డేట్ ఇప్పుడు బయటకి వచ్చింది.
దీనితో ఈ సినిమాలో రియల్ లైఫ్ లో ఉన్న రెండు అత్యంత కీలక పాత్రలు ఉండవట. అవే జనసేన అధ్యక్షుడు ప్రముఖ హీరో పవన్ కళ్యాణ్ అలాగే వై ఎస్ జగన్ సోదరి వై ఎస్ షర్మిల పాత్రలు ఉండవని సినీ వర్గాల్లో సమాచారం. కాకపోతే వారిపై మాటల్లో ప్రస్తావన ఉండొచ్చట కానీ విజువల్స్ మాత్రం ఏమీ ఉండవని మిగతా ముఖ్యులు పాత్రలు మాత్రం సినిమాలో కనిపిస్తాయట. కాగా ఈ చిత్రం ఈ ఫిబ్రవరి 8న అయితే రిలీజ్ కాబోతుంది.