ఓటిటి : “బిచ్చగాడు 2” డిజిటల్ రిలీజ్ డేట్ ఫిక్స్.!

ఈ ఏడాది టాలీవుడ్ సినిమా దగ్గర వచ్చి హిట్ అయ్యిన చిత్రాల్లో తమిళ అవైటెడ్ సినిమా “బిచ్చగాడు 2” కూడా ఒకటి. అయితే గతంలో తమిళ్ కన్నా తెలుగులోనే పెద్ద హిట్ అయ్యిన చిత్రం బిచ్చగాడు కి సీక్వెల్ గా విజయ్ ఆంటోనీ హీరోగా పార్ట్ 2 కి హీరోగా మాత్రమే కాకుండా దర్శకునిగా కూడా తాను వర్క్ చేయగా.

ఈ సినిమా అయితే ఇపుడు థియేటర్లు లో 25 రోజులు సక్సెస్ ఫుల్ గా రన్ కంప్లీట్ చేసుకుంది. ఇక ఈ చిత్రం అయితే తెలుగులో మంచి లాభాలనే అందుకోగా ఇప్పుడు ఐతే డిజిటల్ డెబ్యూ కి రెడీ అయ్యినట్టుగా సినీ వర్గాలు కన్ఫర్మ్ చేస్తున్నాయి.

కాగా ఈ చిత్రం ఓటిటి హక్కులు హాట్ స్టార్ వారు కొనుగోలు చేయగా ఇందులో ఈ చిత్రం ఈ జూన్ 18 నుంచి తెలుగు మరియు తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కి రావడం ఖాయం అయ్యినట్టుగా రూమర్స్ ఇప్పుడు వినిపిస్తున్నాయి. దీనితో ఈ చిత్రంపై అధికారిక అప్డేట్ ఇంకా రావాల్సి ఉంది.

ఇక విజయ్ ఆంటోనీ అయితే ఈ సినిమా కూడా సీక్వెల్ ని అనౌన్స్ చేయగా పార్ట్ 3 కూడా పూర్తిగా కొత్త కథ ఎమోషన్స్ తో ఉంటుంది అని కన్ఫర్మ్ చేసాడు. అంతే కాకుండా ఈ సినిమా కూడా తానే దర్శకత్వం సంగీతం అందించగా తన భార్య ఫాతిమా ఆంటోనీ అయితే నిర్మాణం వహించనున్నారు. కాగా పార్ట్ 2 లో హీరోయిన్ గా అయితే కావ్య థాపర్ నటించిన సంగతి తెలిసిందే.