అఫీషియల్ : “బిచ్చగాడు 2” ఓటిటి డేట్ లాక్, ఎన్ని భాషల్లో అంటే.!

ఈ ఏడాది టాలీవుడ్ సహా కోలీవుడ్ సినిమా దగ్గర కూడా మంచి అంచనాలు అయితే ఏర్పర్చుకుని రిలీజ్ కి వచ్చిన ఇంట్రెస్టింగ్ సీక్వెల్ చిత్రం “బిచ్చగాడు 2”. మరి హీరో విజయ్ ఆంటోని హీరోగా తన దర్శకత్వంలోనే తెరకెక్కించిన ఈ చిత్రం రిలీజ్ కి వచ్చి మంచి హిట్ అయ్యింది.

పైగా తెలుగు సహా తమిళ్ లో కూడా ఈ సినిమా రిలీజ్ కి తీసుకురాగా ఈ సినిమాకి ఒరిజినల్ గా తమిళ్ కంటే తెలుగులోనే అయితే ఎక్కువ వసూళ్లు సాధించింది. ఇక తెలుగులో అదరగొట్టిన ఈ చిత్రం ఓటిటి డెబ్యూ కి సిద్ధం అయ్యింది. కాగా ఈ సినిమా ఓటిటి రైట్స్ సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థ డిస్నీ హాట్ స్టార్ లో అయితే రిలీజ్ కి సిద్ధం అయ్యింది.

కాగా ఈ సినిమా ఇప్పుడు ఈ జూన్ 18న అయితే ఓటిటి లో రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. అయితే ఈ 18న బిచ్చగాడు 2 ని తమిళ్ సహా తెలుగు మలయాళ మరియు కన్నడ భాషల్లో రాబోతున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. సో ఈ జూన్ 18 నుంచి అయితే ఈ చిత్రాన్ని ఓటిటి చూడాలి అనుకునేవారు చూడొచ్చు.

కాగా ఏఈ చిత్రంలో కావ్య థాపర్ హీరోయిన్ గా నటించగా విజయ్ ఆంటోనీ నే సంగీతం అందించాడు అలాగే తన భార్య ఫాతిమా ఆంటోనీ భారీ బడ్జెట్ తో నిర్మాణం వహించారు. అలాగే నెక్స్ట్ బిచ్చగాడు 3 ని కూడా తాను ప్లాన్ చేస్తున్నట్టుగా విజయ్ ఆంటోనీ కన్ఫర్మ్ చేసిన సంగతి తెలిసిందే.