బాక్సాఫీస్ : “బిచ్చగాడు 2”..రెండో రోజు కూడా అదిరే నంబర్స్.!

ఇపుడు టాలీవుడ్ సినిమా దగ్గర సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని రీసెంట్ గా వచ్చిన పలు సినిమాల కంటే ఎక్కువ వసూళ్లే అందుకున్న లేటెస్ట్ సినిమా “బిచ్చగాడు 2”. విజయ్ ఆంటోనీ హీరోగా తన దర్శకత్వంలోనే తెరకెక్కించిన ఈ చిత్రం తమిళ్ లో మరియు తెలుగులో ఇప్పుడు రిలీజ్ అయ్యింది.

కాగా ఈ చిత్రం రిలీజ్ అయ్యాక ఊహించని విధంగా మొదటి రోజు తమిళ్ కన్నా తెలుగులోనే ఎక్కువ వసూళ్లు రిజిస్టర్ చేసి విజయ్ ఆంటోనీ కెరీర్ లోనే భారీ ఓపెనింగ్స్ అందుకుంది. అది కూడా మన తెలుగు ఆడియెన్స్ ఇచ్చారు. కాగా ఈ చిత్రం రెండో రోజు కూడా తెలుగు రాష్ట్రాల్లో అదరగొట్టినట్టు తెలుస్తుంది.

ఈ చిత్రమో మొదటి రోజు 4.5 కోట్లు వసూలు చేయగా రెండో రోజు 3.2 కోట్ల గ్రాస్ తో ఎక్స్ లెంట్ హోల్డ్ ని కనబరిచింది. కాగా దీనితో రెండు రోజుల్లో అయితే బిచ్చగాడు 2 తెలుగులో 7.7 కోట్ల వసూళ్లు అందుకుంది అదరగొట్టింది. కాగా ఈ చిత్రం ఇప్పుడు పెట్టుకున్న టార్గెట్ కూడా ఈ రెండు రోజుల్లో రీచ్ అయ్యిపోతుంది అని ట్రేడ్ వర్గాలు అంటున్నారు.

ఇక మొదటి రోజే అయితే చాలా ఏరియాల్లో సగానికి పైగా వసూళ్లు అందుకుంది. దీనితో మరోసారి ఈ బిచ్చగాడు డిస్ట్రిబ్యూటర్స్ ని ధనవంతులను చేయబోతున్నాడని చెప్పాలి. కాగా ఈ సినిమాలో కావ్య థాపర్ హీరోయిన్ గా నటించగా విజయ్ ఆంటోనీ సంగీతం నిర్మాతగా కూడా ఈ చిత్రానికి వ్యవహరించాడు.