వీడియో టాక్ : ఎనర్జిటిక్ గా రవితేజ “ఈగిల్” ఫస్ట్ సాంగ్..!

టాలీవుడ్ సినిమా దగ్గర ఉన్న సీనియర్ హీరోస్ లో అయితే మంచి ఎనర్జిటిక్ హీరోల జాబితా తీస్తే అందులో ఖచ్చితంగా ఉండే పేరు మాస్ మహారాజ రవితేజ పేరు కూడా. మరి తాను ఇపుడు కూడా ఎంతో ఎనర్జిటిక్ గా సినిమాలు చేస్తూ ఫైట్ లు డాన్స్ లు కూడా చేస్తూ అదరగొట్టేస్తున్నాడు.

మరి రీసెంట్ గా “టైగర్ నాగేశ్వరరావు” గా పలకరించిన తాను ఇప్పుడు సంక్రాంతికి మళ్ళీ నెక్స్ట్ సినిమా “ఈగిల్” తో వచ్చేస్తున్నాడు. కాగా ఈ చిత్రాన్ని కూడా కొత్త దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కిస్తున్నాడు. మరి భారీ అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రం నుంచి చిత్ర బృందం ఫస్ట్ సాంగ్ ని లాంచ్ చేశారు.

అయితే సంగీత దర్శకుడు డావ్ జాన్డ్ ఈ సినిమాకి వర్క్ చేయగా తాను కంపోజ్ చేసిన ఈ ఫస్ట్ సాంగ్ మాత్రం పర్ఫెక్ట్ గా ఉందని చెప్పాలి. రవితేజ మాస్ ఎనర్జీకి తగ్గట్టుగా ఈ సాంగ్ మంచి ఎనర్జిటిక్ బీట్స్ తో వినడానికి ఇంపుగా ఉంది. అంతే కాకుండా దీనికి రాహుల్ సిప్లిగంజ్ వాయిస్ కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది అని చెప్పొచ్చు.

వీటితో పాటుగా సాంగ్ లో సెట్టింగ్స్ రవితేజ డాన్స్ తన లుక్స్ కూడా చాలా బాగున్నాయి. మొత్తానికి అయితే వచ్చే ఏడాది సంక్రాంతికి మంచి ప్లానింగ్ తోనే మేకర్స్ వస్తున్నట్టు అనిపిస్తుంది. మరి చూడాలి ముందు ముందు వచ్చే కంటెంట్ ఎలా ఉంటుంది అనేది. కాగా ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ కావ్య థాపర్ లు కీలక పాత్రల్లో నటిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహించారు.
Aadu Macha Official Lyrical Song | Eagle | Ravi Teja | Anupama Parameswaran | Kavya Thapar | Davzand