వైరల్ :మహేష్ థియేటర్లో ‘బిచ్చగాడు 2’ వీక్షకులకు షాక్.!

లేటెస్ట్ గా టాలీవుడ్ మరియు కోలీవుడ్ సినిమా దగ్గర కూడా రిలీజ్ అయ్యిన చిత్రం “బిచ్చగాడు 2”. విజయ్ ఆంటోనీ హీరోగా తాను దర్శకత్వం వహించిన ఈ సినిమా తన గత చిత్రం “బిచ్చగాడు” కి సీక్వెల్ గా వచ్చి రికార్డు వసూళ్లు అయితే తెలుగు రాష్ట్రాల్లో మరియు తమిళ్ లో అందుకుంది.

కాగా ఈ సినిమా టాక్ రావడంతో మల్టీప్లెక్స్ లలో కూడా ఈ చిత్రం మంచి ఆదరణ అందుకుంటుండగా లేటెస్ట్ గా అయితే హైదరాబాద్ లో మహేష్ బాబు కి ఉన్న ఏ ఎం బి సినిమాస్ లో షో లో ఆడియెన్స్ కి షాకింగ్ మూమెంట్ ఎదురయ్యింది. ఈ ఆదివారం అక్కడ సినిమాకి వెళ్లిన ఆడియెన్స్ కి స్క్రీన్ వారు సినిమాని సెకండ్ హాఫ్ నుంచి స్క్రీనింగ్ కి వేసారట.

కానీ ఇది తెలియని ఆడియెన్స్ మొత్తం అంతా కూడా చూసేసారు. అలా చూసి లాస్ట్ కి ఎండ్ కార్డు చూసి టోటల్ థియేటర్ మొత్తం షాక్ అయ్యారట. దీనితో అసహనానికి లోనయిన ఆడియెన్స్ ఇలాగేనా మేనేజ్మెంట్ చేసేది అంటూ అంతా అక్కడి మేనేజర్ పై అయితే ఫైర్ అవుతున్నారు.

దీనితో ఈ ఫన్నీ అండ్ షాకింగ్ ఇన్సిడెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసినా నెటిజన్స్ మాత్రం పాపం అనుకోని నవ్వుతున్నారు. ఇపుడు అయితే బిచ్చగాడు 2 అదిరే వసూళ్లు రాబడుతుంది. మొత్తానికి మాత్రం మహేష్ థియేటర్ లో ఆడియెన్స్ కి ఊహించని ట్విస్టే ఎదుర్కొన్నారు. 
https://twitter.com/MilagroMovies/status/1660167326128549889