వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 కార్యక్రమంలో ఆదివారం ఎపిసోడ్ వినోదంతో పాటు చాలా థ్రిల్‌ని కలిగించింది. ముఖ్యంగా ఎలిమినేషన్ సమయంలో నడిచిన డ్రామా ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించింది. నామినేషన్‌లో ఉన్న ఆరుగురు సభ్యులలో నలుగురిని సేవ్ చేసిన నాగార్జున మిగిలిన ఇద్దరు అంటే అమ్మ రాజశేఖర్, అవినాష్‌లని గార్డెన్ ఏరియాలో ఉన్న బూత్‌లలోకి రమ్మని ఆదేశించారు. బూత్‌లలోకి వెళ్ళే ముందు ఈ ఇద్దరు అందరు గేమ్ బాగా ఆడాలంటూ సూచించారు.
అవినాష్‌ని పక్కకు తీసుకెళ్ళిన అరియానా.. మహానటి రేంజ్‌లో జీవించింది. గతంలో అవినాష్ తన బాధలని అరియానాకి చెప్పడంతో ఇప్పుడు బయటకు వెళ్ళాక ఆయనేమన్నా చేసుకుంటాడేమోనని ముందే ఊహించిన అరియానా.. ‘‘ఒక వేళ అటూ ఇటూ అయితే ప్లీజ్ నా కోసం వెయిట్ చేయవా. నేను రాగానే నిన్ను కలుస్తాను. నీ ప్రాబ్లమ్స్ గురించి నువ్వు ఏమీ ఆలోచించకు. ఒక వేళ ఏమన్నా అయితే ఏ డిసీజన్ తీసుకోకు.. ప్లీజ్. మమ్మీ మీద ప్రామిస్ చేయి. నువ్వు ఏం చేసుకోవద్దు. నీ కాళ్లు పట్టుకుంటా.. ప్లీజ్. నువ్వు బతికుండు చాలు అవినాష్. ప్లీజ్ అవినాష్.. ప్లీజ్ అంటూ ప్రాధేయపడింది.
మహానటి రేంజ్‌లో జీవించిన అరియానాకు ధైర్యం చెప్పిన అవినాష్ బూత్ లోకి వెళ్ళాడు. ఆయనతో పాటు మాస్టర్ కూడా వెళ్ళాడు. గ్రీన్ లైట్ ఆగాక బూత్ తెరిచి చూడమని నాగార్జున చెప్పడంతో ఇద్దరు అందులో కనిపించలేదు. డబుల్ ఎలిమినేషన్ అయి ఉంటుందేమో అని నాగ్ అనడంతో అరియానా కంటి నుండి కన్నీటి ధార పారింది. చివరకు అవినాష్‌ని సేవ్ చేసి అమ్మ రాజశేఖర్ ఎలిమినేట్ అయినట్టు ప్రకటించాడు నాగార్జున. అయితే తాను ఎలిమినేట్ అయితాడేమోనని బాధపడ్డ అవినాష్ సేవ్ అయ్యాక కూడా వెక్కి వెక్కి ఏడ్చాడు. గుండె ఆగినంత పని అయింది. బిగ్ బాస్ ద్వారా నాకు మళ్లీ లైప్ వచ్చింది అంటూ దుఃఖసాగరంలో మునిగాడు. అయితే స్టేజ్‌పైకి వచ్చిన మాస్టర్‌ని అసలు, నకిలీ అనే గేమ్ ఆడించాక సాగనంపారు. తనకున్న కెప్టెన్సీ బాధ్యతను మెహబూబ్ కి ఇచ్చాడు అమ్మ.