Health Tips: ఇంట్లో విరివిగా ఉపయోగించే మసాలా దినుసులలో లవంగాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. లవంగాలను వంటలలో ఉపయోగించే బంగారం వంటలు మరింత రుచికరంగా, సువాసన భరితంగా ఉంటాయి. లవంగాలను ఆయుర్వేదంలో కూడా విరివిగా ఉపయోగిస్తారు.కాస్మొటిక్స్, ఫార్మాస్యూటికల్, వ్యవసాయ ఉత్పత్తుల్లో కూడా లవంగాలు ఎక్కువగా వాడతారు. ఆరోగ్యానికి అవసరమయ్యే అనేక రకాల పోషకాలు లవంగాలలో దాగి ఉంటాయి.
లవంగాల్లో ఐరన్, కార్బోహైడ్రేట్లు, కాల్షియం, ఫాస్పరస్, పొటాషియం, సోడియం, హైడ్రాలిక్ ఆసిడ్, మాంగనీస్, విటమిన్ ఏ వంటివి ఎక్కువగా ఉంటాయి. జలుబు, దగ్గు, పంటి నొప్పి, నోటి దుర్వాస వంటి సమస్యల నుండి లవంగాలు ఉపశమనం కలిగిస్తాయి. బిపి , షుగర్ వంటి సమస్యలను నియంత్రించడంలో కూడా లవంగాలు ఎంతో ఉపయోగపడతాయి. బిపి, షుగర్ సమస్యలను నివారించేందుకు లవంగాలను ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.
లవంగాలలో నైజీరిసిన్ అనే సమ్మేళనం ఉంటడం వల్ల షుగర్ సమస్యలు నియంత్రణలో ఉంటాయి. మూడు లేదా నాలుగు లవంగాలను నమిలి తినటం వల్ల లవంగాల లో ఉండి నైజీరిసిన్ అనే పదార్థం రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది . రోజు రాత్రి వేల ఒక గ్లాస్ నీటిలో మూడు లవంగాలు నానబెట్టి ఉదయం లేవగానే ఆ నీటిని తాగటం వల్ల బిపి సమస్య అదుపు చేయవచ్చు. అంతే కాకుండా బ్రోన్కైటిస్, సైనస్, ఉబ్బసం , కిడ్నీ సంబంధిత సమస్యలు కూడా నియంత్రించవచ్చు.