మహేష్,పూరి విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నారా.. ఇందులో నిజమెంత?

టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్, హీరో మహేష్ బాబు కాంబినేషన్ లో విడుదలైన పోకిరి,బిజినెస్ మెన్ సినిమాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో మనందరికీ తెలిసిందే. అయితే మహేష్ అభిమానులు వీరిద్దరి కాంబినేషన్ లో ఒక హ్యాట్రిక్స్ విమా వస్తుందని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నప్పటికీ అది ఇప్పట్లో జరిగేలా కనిపించడం లేదు. ఇదిలా ఉంటే ఇటీవలే మహేష్ బాబు 47వ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. మహేష్ పుట్టినరోజు సందర్భంగా ఆరోజు ఒక్కడు పోకిరి సినిమాలను మళ్లీ థియేటర్స్ లో విడుదల చేశారు.

అయితే మహేష్ బాబు కెరీర్ లో పోకిరి సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలుస్తుంది. ఈ సినిమాకు ముందు నుంచి భారీగా రెస్పాన్స్ వచ్చింది. కేవలం ఇక్కడ మాత్రమే కాకుండా ఓవర్సీస్ లో కూడా దాదాపుగా 400 స్పెషల్ షోలను ప్రదర్శించారు. అయితే పోకిరి సినిమా గురించి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నా కూడా సినిమా డైరెక్టర్ పూరి జగన్నాథ్ సినిమా గురించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం ఆశ్చర్యపోవాల్సిన విషయం. అంతే కాకుండా మహేష్ బాబుకి సోషల్ మీడియా వేదికగా కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపలేదు.

అయితే మహేష్ బాబు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో జనగణమన సినిమా రాబోతోంది అని అనౌన్స్ చేసినప్పటికీ ఈ విషయం అధికారికంగా ప్రకటించలేదు. ఇందుకు గల ప్రధాన కారణం డైరెక్టర్ కి హీరోకి మధ్య గ్యాప్ వచ్చిందని విభేదాల వల్లే వీరు కాస్త దూరంగా ఉంటున్నారని అని సమాచారం. కాగా పూరి పోకిరి సినిమా గురించి మాట్లాడలేదు అరే కొందరు చెబుతుండగా ఇంకొందరు మాత్రం పూరి జగన్నాథ్ సోషల్ మీడియాలో అందుబాటులో లేకపోవడంతో ఎటువంటి కామెంట్స్ చేయలేదని అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్ర‌స్తుతం వారిద్ద‌రి మ‌ధ్య న‌డుస్తున్న ఈ కోల్డ్ వార్ ప్ర‌స్తుతం టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. కాగా, లైగ‌ర్ సినిమా ప్రమోషన్స్ లో బాగా పూరి జగన్నాథ్ బిజీబిజీగా ఉన్న విషయం తెలిసిందే. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు ఈ సినిమాను తీసుకురానున్నారు పూరి జగన్నాథ్.