విజయ్ దేవరకొండని మళ్ళీ ఆ ‘పురుగు’ కుట్టిందట.!

ఎలాంటోడు.. ఎలా అయిపోయాడు.? పాన్ ఇండియా హీరో కాస్తా.. దారుణంగా చతికిలపడిపోవాల్సి వచ్చింది. ఎందుకీ పరిస్థితి.? చేసుకున్నోడికి చేసుకున్నంత.! ‘ఖుషీ’ సినిమా చేశాడు. కానీ, కోలుకోలేకపోయాడు. సినిమా హిట్టు.. ఇదిగో నా వైపు నుంచి కొన్ని కుటుంబాలకు సాయమంటూ చిత్ర విచిత్రమైన పబ్లిసిటీ స్టంట్ చేశాడు.

రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించే ఇదంతా. సాయం మంచిదే.! కానీ, ‘ఖుషీ’ వల్ల నష్టపోయిన నిర్మాతల్ని ఆదుకోవడానికి కూడా సాయం చేసి వుంటే బావుండేది.! చేతిలో సినిమాలున్నాయ్.. అందులో ఒకటి ‘ఫ్యామిలీ స్టార్’.! మృనాల్ ఠాకూర్ హీరోయిన్.

ఆ మధ్య ‘జనగనమన’ అని ఓ సినిమా స్టార్ట్ చేసి వదిలేశాడు. దర్శక నిర్మాత పూరి జగన్నాథ్ దర్శక నిర్మాణంలో తెరకెక్కాల్సిన సినిమా అది. ‘లైగర్’ దెబ్బకి, ‘జనగనమన’ ఆగిపోయిన సంగతి తెలిసిందే. ప్రారంబమవకుండానే ఆగిపోయిందని అనొచ్చు.

ఏమయ్యిందోగానీ, మళ్ళీ ఆ ప్రాజెక్టు మీదకు మనసు మళ్ళిందట విజయ్ దేవరకొండకి. పాన్ ఇండియా సినిమా మళ్ళీ చేద్దాం.. అని విజయ్ దేవరకొండ, ఆర్థిక వనరులు సమకూర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

పూరి జగన్నాథ్ కాకుండా, ఇంకో దర్శకుడితో ఆ సినిమా చేయాలనే ఆలోచనలో విజయ్ దేవరకొండ వున్నాడన్నది తాజా ఖబర్. నిర్మాణంలో మాత్రం పూరి జగన్నాథ్‌కి భాగం ఇస్తాడట. ఎందుకంటే, ఆ ప్రాజెక్టే పూరి జగన్నాథ్ డ్రీమ్.!

‘డబుల్ ఇస్మార్ట్’ గనుక హిట్టయితే, తానే ఆ ప్రాజెక్టుని పట్టాలెక్కిస్తానని పూరి అంటున్నాడట. కానీ, విజయ్ దేవరకొండ మాత్రం, వేరే దర్శకుడి వైపే మొగ్గు చూపుతున్నాడన్నది ఇన్‌సైడ్ సోర్సెస్ కథనం.