Devara: టిక్కెట్ల పెంపు కేవలం పదిరోజులే… ‘దేవర’ మూవీ టిక్కెట్ల ధరలపై హైకోర్టు

Devara Movie: టాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్‌ నటిస్తున్న మోస్ట్‌ అవైటెడ్‌ పాన్‌ ఇండియా మూవీ ’దేవర’ కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం సెప్టెంబర్‌ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా టికెట్ల ధరల పెంపునకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్ట్‌ కీలక తీర్పును వెలువరించింది. ఈ సినిమా టికెట్ల పెంపునకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ.. 14 రోజుల వరకు ఉన్న అనుమతిని 10రోజులకే పరిమితం చేస్తూ ఆదేశాలిచ్చింది. టికెట్‌ ధరల పెంపుదల నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిల్‌ ను విచారించిన కోర్టు పిటీషనర్‌ వాదనతో ఏకీభవించింది.

Devara Movie Review: ‘దేవర’ మూవీ ఎలా ఉందటే…

ఈ సినిమా కోసం టికెట్ల ధరల పెంచాలని ‘దేవర’ మూవీ టీమ్‌ ప్రభుత్వాన్ని కోరగా.. దీనికి అనుమతినిస్తూ.. మల్టీప్లెక్స్‌ థియేటర్లలో ఒక్కో టికెట్‌పై అదనంగా రూ.135 పెంచుకునేందుకు అలాగే సింగిల్‌ స్క్రీన్‌లలో బాల్కనీ టికెట్‌పై అదనంగా రూ.110, లోయర్‌ క్లాస్‌ టికెట్‌పై రూ.60 అధికం చేసేందుకు అనుమతి ఇచ్చింది.

రెండు వారాల వరకు టికెట్లపై అదనపు ధరలు ఉంచుకోవచ్చంటూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. అయితే ఈ జీవోను సవాలు చేస్తూ.. హైకోర్టులో పిటిషన్‌ ధాఖలు కాగా.. ఈ పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం 14 రోజుల వరకు అనుమతిని 10రోజులకే పరిమితం చేస్తూ తీర్పు వెలువరించింది.

Analyst Dasari Vignan About NTR Fans | Devara Movie Review | Jr NTR | Janhvi Kapoor | Koratala Siva