మరో రోజు మరో బిగ్ రికార్డు అందుకున్న “హనుమాన్” చిత్రం 

ఇప్పుడు తెలుగు సినిమా నుంచి వచ్చిన హనుమాన్ సినిమా ఇటీవల కాలంలో వచ్చి ఏ పెద్ద చిత్రం కూడా అందుకొని రికార్డులు చేస్తుంది. చిన్న సినిమా గానే స్టార్ట్ అయ్యినప్పటికీ ఈ సినిమా రికార్డు వసూళ్లు కొల్లగొడుతూ అసలు ఎవరూ ఊహించని విధమైన రన్ ని కొనసాగిస్తుంది.

కాగా ఈ చిత్రం నిన్ననే 250 కోట్ల గ్రాస్ మార్క్ లోకి చేరి రికార్డు సెట్ చేయగా ఇప్పుడు మళ్ళీ గ్యాప్ లోనే రెండో రోజే ఇంకో క్రేజీ రికార్డు టాలీవుడ్ లో సెట్ చేసింది. జెనరల్ గా తెలుగు సినిమా దగ్గర ఒక చిత్రం కోటి ఫ్యట్ ఫాల్స్ న సాధించడం అనేది చాలా గొప్ప విషయం ఏ హీరో సినిమా అయినా కూడా ఎంతో పెద్ద హిట్ అయితే తప్ప ఇలాంటి బిగ్ ఫీట్ సాధించడం కుదరదు.

కానీ ఇప్పుడు మొదటి సారిగా ఈ చిన్న చిత్రం కూడా ఈ మార్క్ అందుకున్నట్టుగా చిత్ర యూనిట్ అఫీషియల్ గా ఈ విషయాన్ని ప్రకటించారు. దీనితో హనుమాన్ ఖాతాలో అయితే మరో రోజు మరో రికార్డు పడింది అని చెప్పాలి. ఇక ఈ సినిమాలో హీరోగా తేజ సజ్జ నటించగా దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించాడు.

అలాగే వినయ్ రాయ్ విలన్ గా నటించగా వరలక్ష్మి శరత్ కుమార్ అలాగే గెటప్ శ్రీను తదితరులు నటించారు. అలాగే ఇపుడు ఈ చిత్రం 300 కోట్ల గ్రాస్ దిశగా అయితే ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తుంది. అలాగే హనుమాన్ పార్ట్ 2 పనులు అయితే ఇప్పుడు మొదలు అవుతున్నాయి.