ఆంజనేయుడి భక్తితో పూజ చేస్తే చాలు.. అన్ని కష్టాలు పోతాలు పెద్దలు చెబుతుంటారు. హనుమంతుడిని నిత్యం భక్తితో పూజిస్తే జీవితం సుఖమయంగా మారుతుందని భక్తుల విశ్వాసం. రామ భక్తుడైన హనుమంతుని కృప దక్కితే ఆ వ్యక్తి జీవితంలో ఉన్న అప్పులు, భయాలు, అనారోగ్య సమస్యలు, పేదరికం ఒక్కొక్కటిగా తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.
నిత్యం అనారోగ్యం వెంటాడుతుంటే హనుమాన్ చాలీసా పఠించడం అత్యంత శ్రేయస్కరం. హనుమాన్ చాలీసా పఠనంతో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, మనసుకు ధైర్యం కలుగుతుంది. రోజువారీ జీవితంలో ఎదురయ్యే సమస్యలకు ఓ నివారణ లభిస్తుంది. అనేక మంది భక్తులు ఈ చాలీసా వల్ల తమ జీవితంలో పెద్ద మార్పులు వచ్చాయని చెబుతుంటారు.
తమ జీవితంలో ఎప్పుడూ సమస్యల మధ్యే జీవితం గడుస్తోందని భావిస్తే… ఓం నమో హనుమతే రుద్రావతారాయ సర్వశత్రుసంహరణాయ సర్వరోగ హరాయ సర్వవశీకరణాయ రామదూతాయ స్వాహా” అనే ఈ మంత్రాన్ని రోజూ కొద్దిసేపు జపించాలి. ఈ మంత్రంలో హనుమంతుని రుద్రావతారం గురించి ప్రస్తావన ఉంటుంది. ఇది శత్రువుల నుంచి రక్షణను కలిగిస్తుందని, అన్ని రోగాలు తొలగిస్తుందని, శత్రువులు దరిచేరరని పురాణాలు చెబుతున్నాయి.
కేవలం ఆరోగ్యం మాత్రమే కాదు, ఆర్థిక సమస్యలు కూడా పరిష్కరమవుతాయని భక్తులు విశ్వసిస్తారు. ఎవరైనా అప్పుల భారం నుంచి బయట పడాలని ఆశిస్తే “సర్వభయ నివారణ సర్వ జయ శ్రీ మారుతి స్తోత్రం”ను పఠించడం ద్వారా మంచి ఫలితాలు కలుస్తాయని పండితులు చెబుతున్నారు. హనుమంతుని నామస్మరణ వల్ల మనసు స్థిరపడుతుంది, గ్రహ బలహీనతలు తగ్గుతాయి.
ఇంకా ముఖ్యంగా హనుమంతుని నిత్యం పూజించడం వల్ల జాతకంలోని ప్రతికూల గ్రహ ఫలితాలు తగ్గుతాయని, మంచి యోగాలు కలుస్తాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. అందుకే చాలా మంది రోజూ హనుమాన్ చాలీసా లేదా సుందర కాండం పఠిస్తుంటారు. ఒక్కసారి ఆంజనేయుడి కృప కలిసిందంటే ఆ వ్యక్తి జీవితంలో ఎలాంటి కష్టమైనా దరిచేరదు అనే నమ్మకం కోట్లాది మంది హనుమాన్ భక్తుల్లో ఉంది. అందువల్ల ఎవరైనా ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, భయాలు, సమస్యలు లేకుండా నిలకడగా, ధైర్యంగా ఉండాలని కోరుకుంటే హనుమంతుని క్రమం తప్పకుండా పూజించడం, ఆయన మంత్రాలను శ్రద్ధగా జపించడం మంచిదని పండితులు సూచిస్తున్నారు.
