ఆ కోరిక మరింత పెరిగింది.. తనని డబ్బింగ్ చెప్పనివ్వట్లేదంటున్న అమృత అయ్యర్!

అల్లరి నరేష్ కొత్త సినిమా బచ్చలమల్లి క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 20న విడుదల కాబోతుంది. సోలో బతుకే సో బెటరు ఫేమ్ సుబ్బు మాంగాదేవి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు అమృత అయ్యర్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సందర్భంగా విలేఖరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు అమృత. ముందునుంచి పల్లెటూరి అమ్మాయి పాత్రలే వస్తున్నాయి కానీ ఈ సినిమాలో సిటీ కల్చర్ ఉన్న క్యారెక్టర్ లో కనిపిస్తున్నాను.

80ల బ్యాక్ డ్రాప్ లో జరిగే కథ ఇది, ఇందులో నాకు నరేష్ గారికి మధ్య మంచి ఎమోషనల్ సీన్స్ ఉంటాయి. నరేష్ గారు చాలా సాఫ్ట్ పర్సన్ ఆన్ స్క్రీన్ అగ్రెసివ్ క్యారెక్టర్ ఉంటుంది అయినా ఆఫ్ స్క్రీన్ లో మా అందరితోని బాగా కలిసిపోయి తన అనుభవాలను చెప్పేవారు. నా సినిమాలలో పాటలు అన్నీ ప్రత్యేకంగా ఉంటాయి. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా దగ్గరనుంచి మొన్న మొన్నటి హనుమాన్ వరకు పాటలన్నీ ప్రత్యేకమే. అలాగే ఈ సినిమాలో కూడా పాటలు ప్రత్యేకంగానే ఉంటాయి.

అందులోనూ సీతారామం మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ చంద్రశేఖర్ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారని తెలిసి మరింత ఆనందంగా అనిపించింది. ఇందులో పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. సినిమా రిలీజ్ తర్వాత మరింత కనెక్ట్ అవుతారు. హనుమాన్ సినిమా చేస్తున్నప్పుడు ఆ సినిమాకి సంబంధించిన ఏ విషయాలు బయట మాట్లాడవద్దని చెప్పారు. ఆ సినిమా ముందు తెలుగు సినిమా లాగే మొదలుపెట్టాం కానీ పాన్ ఇండియా స్థాయికి వెళ్ళింది అని చెప్పింది అమృత .

తనకి డ్రీమ్ గర్ల్,యువరాణి తరహా పాత్రలు చేయాలనే కోరిక బలంగా ఉందని, పొన్నియన్ సెల్వన్ సినిమా చూసిన తర్వాత ఆ కోరిక మరింతగా పెరిగిందని, యాక్షన్ ప్రధానమైన పాత్రలు అన్నా కూడా తనకి ఇష్టమే అని చెప్పుకొచ్చింది. ఇప్పుడు తెలుగు బాగా వచ్చింది డబ్బింగ్ నేనే చెబుతాను అంటే నీ మాటలు చిన్నపిల్లలు మాట్లాడినట్లుగా ఉన్నాయి వద్దు అంటున్నారు దర్శకులు అని చెప్పుకొచ్చింది. హనుమాన్ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న అమృత అయ్యర్ బచ్చల మల్లి సినిమాతో మరింత సక్సెస్ అందుకోవాలని ఆశిద్దాం.