ఫ్రస్టేషన్ లో యాంకర్ రష్మీ… వరుస పోస్టులతో క్షమాపణలు?

ప్రముఖ బులెతెర యాంకర్ రష్మి గౌతమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బుల్లితెరపై ప్రసారం అవుతున్న టీవీ షో ద్వారా రష్మి ప్రేక్షకులను అలరిస్తోంది. బుల్లితెర మీద తన గ్లామర్ తో ప్రేక్షకులను ఆకట్టుకునే రష్మి సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. రష్మీ సోషల్ మీడియాలో తన అందమైన ఫోటోలతో పాటు ఫన్నీ వీడియోలు కూడా షేర్ చేస్తూ ఉంటుంది. అంతే కాకుండా రష్మి సోషల్ మీడియా ద్వారా జంతువుల గురించి వాటి సంరక్షణ గురించి తెలియజేస్తూ పోస్ట్ లు షేర్ చేస్తూ ఉంటుంది. రష్మి ఒక పెట్ లవర్. మూగజీవాల మీద రష్మి తన ప్రేమను చూపిస్తూ ఉంటుంది.

ఎన్నో సందర్భాలలో రోడ్ల మీద ఆహారం లేకుండా తిరుగుతున్న మూగ జీవాలను రష్మి ఆహారం అందించటమే కాకుండా అనారోగ్యంగా ఉన్న వాటికి ట్రీట్మెంట్ కూడా చేయిస్తుంది. మూగ జీవాలను హింసించే వారి పట్ల రష్మి ఆగ్రహాం వ్యక్తం చేస్తూ..వారికి శిక్ష పడేలా చేస్తుంది. జంతువులపై ప్రేమ కలిగి ఉండాలని సోషల్ మీడియా ద్వారా ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ఉంటుంది. తాజాగా సోషల్ మీడియాలో రష్మి షేర్ చేసిన పోస్ట్ లు ఇప్పుడు వైరల్ గా మారాయి. కొందరు పెట్ డాగ్స్ యానిమాల్ పట్ల రష్మి ఆగ్రహాం వ్యక్తం చేసింది. గత 24 గంటల్లో వివిధ జాతులకు చెందిన నాలుగు పెట్ డాగ్స్ నిరాదరణకు గురయ్యాయని రష్మి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

పెట్ డాగ్స్ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిని ఉద్దేశిస్తూ రష్మి సీరియస్ గా పోస్ట్ లు షేర్ చేసింది. పెట్ డాగ్స్ ని వదిలేసిన వాళ్ళను కర్మ వెంటాడుతుందని హెచ్చరించారు. ఈ రోజు మీ డాగ్స్ ని వదిలేస్తే ఖచ్చితంగా మీ పిల్లలు రేపు మిమ్మల్ని నిరాదరణకు గురి చేస్తారు అంటూ మంది పడింది. మూగజీవాలో నిరాధారణకు గురయ్యాయన్న విషయం తెలిసిన రష్మి సోషల్ మీడియాలో చాలా పోస్టులు షేర్ చేసింది . అయితే కొంత సమయానికి క్షమించాలి ఫ్రస్ట్రేషన్ లో చేస్తున్న పోస్ట్స్ ఇవి చెప్పి వాటిని డిలీట్ చేసింది. ఈ పోస్ట్ లు నెటిజన్లు రష్మీ లాగే తన మనసు కూడా చాలా అందమైనది అంటూ కొందరు కామెంట్లు పెడుతున్నారు.