పుష్ప అంటే వరల్డ్ ఫైర్.. పుష్ప 2 పై అంబటి రాంబాబు అదిరిపోయే రివ్యూ!

ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5న పుష్ప 2 సినిమా రిలీజ్ అయిన సంగతి అందరికీ తెలిసిందే.ఈ సినిమా మంచి పాజిటివ్ రెస్పాన్స్ తో బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తుంది. ఇక ఎప్పటిలాగే సినిమాపై ఎవరికి నచ్చిన రివ్యూలు వాళ్ళు ఇస్తూనే ఉన్నారు. కొందరు మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ సినిమాలో డైలాగులు రాశారు అని రివ్యూ ఇచ్చారు.అదే సమయంలో వైసీపీ నుంచి ఈ సినిమాకి ఫుల్ సపోర్ట్ వచ్చినట్లు కనిపిస్తుంది.

చాలామంది వైసీపీ నేతలు ప్రీమియర్లు, బెనిఫిట్ షోలు చూసారు అలాగే రివ్యూలు కూడా ఇచ్చారు. ఈ సందర్భంగా వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు సినిమాకి రివ్యూ ఇస్తూ పుష్ప అంటే వైల్డ్ ఫైర్ అనుకుంటివా కాదు వరల్డ్ ఫైర్ అంటూ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అలాగే ఒక వీడియోను కూడా విడుదల చేస్తూ తెలుగు సినిమా పుష్ప ని అందరు ధియేటర్ కి వెళ్లి చూడాలని, ఆదరించాలని కోరారు.

ఈ విషయంపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. అంబటి రాంబాబుకి కృతజ్ఞతలు చెప్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇక మరొక వైసీపీ మాజీ ఎమ్మెల్యే బన్నీ క్లోజ్ ఫ్రెండ్ అయిన శిల్ప రవిచంద్ర బన్నీతో కలిసి ఈ సినిమా చూశారు. ఇదంతా చూస్తుంటే సినిమా విడుదల కి ముందు మెగా ఫ్యాన్స్ కి అల్లు ఫాన్స్ కి మధ్యలో జరిగిన కోల్డ్ వార్ లో వైసీపీ వర్గం బన్నీకి సపోర్ట్ గా నిలబడుతున్నారని అర్థమైంది.

ఈ శిల్పా రవిచంద్ర కి సపోర్ట్ చేస్తూ ఎన్నికలలో ప్రచారం చేసినందుకే మెగా ఫ్యాన్స్ కి అల్లు ఫాన్స్ కి మధ్య వార్ స్టార్ట్ అయిన విషయం అందరికీ తెలిసిందే. అందుకే ఇందులో అల్లు అర్జున్ చెప్పిన కొన్ని డైలాగులు వాళ్లని ఉద్దేశించి చెప్పినవే అంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు. మనం టాప్ లో ఉన్నప్పుడు ఈగో లకు పోకూడదు అనే డైలాగు కూడా మెగా ఫ్యామిలీని ఉద్దేశించిందే అంటున్నారు మరి దీనిపై మెగా ఫ్యామిలీ ఎలా స్పందిస్తుందో చూడాలి.