అజయ్‌ దేవగణ్‌ ‘మైదాన్‌’ ఓటీటీలోకి వచ్చేసింది!

బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘మైదాన్‌’ . ఇండియన్‌ లెజెండరీ ఫుట్‌బాల్‌ కోచ్‌ అబ్దుల్‌ రహీమ్‌ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ఈ సినిమాకు అమిత్‌ రవీంద్రనాథ్‌ శర్మ దర్శకత్వం వహించాడు. జీ స్టూడియోస్‌ సంస్థ, బోనీకపూర్‌ నిర్మాతలుగా వ్యవహరించారు.

ఈ సినిమా అనుకోని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తూ.. ఎట్టకేలకు ఏప్రిల్‌ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద యావరేజ్‌గా నిలిచింది. ఇప్పుడు తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్‌ ప్రైమ్‌లో ఈ సినిమా ప్రస్తుతం రెంటల్‌ విధానంలో అందుబాటులోకి వచ్చింది. రూ.349కి ఈ సినిమాను ప్రైమ్‌ అందుబాటులో ఉంచింది. 1950-62 మధ్యకాలంలో ఫుట్‌బాల్‌ ఆటకు ఇండియాలో విపరీతమైన క్రేజ్‌ ఉండేది.

అయితే ఫుట్‌బాల్‌ ఆటకు ఇంత ఆదరణ రావడానికి కారణం ఫుట్‌బాల్‌ కోచ్‌ అబ్దుల్‌ రహీమ. అతను కోచ్‌గా ఉన్నప్పుడే 1951, 1962లో భారత ఫుట్‌ బాల్‌ టీమ్‌ ఆసియా గేమ్స్‌ లో విజయం సాధించింది. ఇక అబ్దుల్‌ రహీమ్‌ కోచ్‌గా ఉన్నప్పుడు జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమా రాగా.. అబ్దుల్‌ రహీమ్‌ పాత్రలో అజయ్‌ దేవగణ్‌ నటించగా.. అతడి భార్య పాత్రలో ప్రియమణి నటించింది. ఇక ఈ సినిమాలో గజ్రాజ్‌ రావ్‌. రుద్రానిల్‌ ఘోష్‌ కీలక పాత్రలు పోషించారు.