పాపమ్.. మళ్ళీ ఎన్టీఆర్ సినిమాకి చిల్లరే..!

టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్నటువంటి హీరోస్ లో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒకడు. ఇప్పుడు తాను ఏకంగా వరల్డ్ వైడ్ క్రేజ్ ని తన లేటెస్ట్ చిత్రం ఆర్ ఆర్ ఆర్ తో అందుకున్నాడు. ఇప్పుడు దర్శకుడు కొరటాల శివతో “దేవర” అనే భారీ సినిమా కూడా చేస్తున్నాడు.

కానీ ఈ షూటింగ్స్ పక్కన పెడితే టాలీవుడ్ లో కొనసాగుతున్న రీ రిలీజ్ ల పర్వంలో ఈరోజు తెలుగు స్టేట్స్ లో ఎన్టీఆర్ హిట్ చిత్రం “అదుర్స్” కూడా వచ్చింది. అయితే అనుకున్నట్టుగానే ఈ సినిమాకి ఊహించని రెస్పాన్స్ నే వచ్చింది. ఈరోజు రిలీజ్ కి వచ్చిన ఈ చిత్రం ఎక్కడా కూడా ఫుల్స్ పడలేదు.

ఒక్క ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఒకటి రెండు థియేటర్స్ మినహా ఇంకెక్కడా ఈ చిత్రానికి వసూళ్లు నమోదు కాలేదు. దీనితో ఈ సినిమాకి తెలుగులో ఈ మధ్య కాలంలో వచ్చిన చిత్రాల్లో అది కూడా స్టార్ హీరో చిత్రాల్లో కేవలం 9 లక్షల కి తక్కువే వచ్చినట్టుగా తెలుస్తుంది.

దీనితో రీ రిలీజ్ లలో ఇదొక ప్లాప్ అనే చెప్పాలి. ఇప్పటివరకు ఎన్టీఆర్ నుంచి వచ్చిన చిత్రాల్లో ఒక్క సింహాద్రి తప్ప ఇంకే చిత్రానికి కూడా చెప్పుకోదగ్గ వసూళ్లు రాలేదు. అయితే అదుర్స్ సినిమా పెద్ద హిట్ అయినప్పటికీ ఈ సినిమాకి ఇంత తక్కువ వసూళ్లు రావడం అనేది ఒకింత చాలా మందికి ఆశ్చర్యంగా ఉంది. సరైన ప్లానింగ్ లేదా అంటే ట్రైలర్ ని హీరో విశ్వక్ సేన్ తో ట్రైలర్ రిలీజ్ చేసుకొని ప్రమోషన్స్ అవీ బాగానే చేసుకున్నారు అయినా కూడా ఈ చిత్రంకి చిల్లరి వచ్చింది.