ప్రస్తుతం ఇండియన్ సినిమా అంతా కూడా వినిపిస్తున్న ఒకే ఒక్క సినిమా పేరు “ఆదిపురుష్”. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా కృతి సనన్ హీరోయిన్ గా హిందీ దర్శకుడు ఓంరౌత్, ఒక్క ప్రభాస్ తప్ప మొత్తం టెక్నీషియన్ అంతా కూడా హిందీ లోనే తెరకెక్కించిన ఈ చిత్రం మరికొన్ని రోజుల్లో బిగ్ స్క్రీన్స్ ని హిట్ చేయనుంది.
కాగా ఈ సినిమాపై ఇప్పటి వరకు ఉన్న హైప్ కి కారణం ఏదన్నా ఉంది అంటే అది మొదటి కారణం రామాయణ నేపథ్యం కాగా అందులో ఎమోషన్ తో పాటుగా భారీ విజువల్స్ తో వచ్చిన ఫస్ట్ ట్రైలర్ అని చెప్పాలి. కాగా టీజర్ తో పోలిస్తే ట్రైలర్ కి భారీ రెస్పాన్స్ రావడంతో ఒక్కసారిగా అంతా మారింది.
నాచురల్ హాలీవుడ్ లెవెల్ గ్రాఫిక్స్ తో అయితే ఈ ట్రైలర్ కనిపించగా అంతా బాగా ఎగ్జైట్ అయ్యారు. ఇక నిన్ననే సినిమా నుంచి రెండో ట్రైలర్ ని అయితే రిలీజ్ చేయగా ఈ ట్రైలర్ విషయంలో మాత్రం మరోసారి దెబ్బ పడేలా ఉందని చెప్పాలి. మరీ అంత నాచురల్ గ్రాఫిక్స్ లేవు కానీ ఫుల్ ఆన్ యాక్షన్ తో ఉంది.
అలాగే చాలా వరకు వి ఎఫ్ ఎక్స్ మళ్ళీ టీజర్ లో లాగానే ఉండడంతో ఫ్యాన్స్ లో మరోసారి కొంచెం కంగారు మొదలైంది. కానీ మొత్తానికి అయితే పర్వాలేదు అనిపించేలా ఉందని చెప్పొచ్చు. కానీ ఫుల్ లెంగ్త్ సినిమా మాత్రం ఆడియెన్స్ ని విజువల్ గా పూర్తి స్థాయిలో ఆకట్టుకునే సినిమాగా మాత్రం ఇది నిలవదనే అనిపిస్తుంది. అంతే కాకుండా ఈ ట్రైలర్ చూసాక ఇక భారం అంతా ప్రభు శ్రీరామ్ మీదే వేశామని కూడా అంటున్నారు. మరి సినిమా వచ్చాక ఎలా ఉంటుందో చూడాలి.

