జిఎస్టి కలిపి “ఆదిపురుష్” తెలుగు బిజినెస్ ఎంతంటే.!

మరికొన్నాళ్లు వరకు కూడా పాన్ ఇండియా సినిమా దగ్గర వినిపించే హీరో పేరు ప్రభాస్ కాగా తన సినిమా “ఆదిపురుష్” పేరు కూడా మారుమోగుతోంది అని చెప్పడంలో సందేహమే లేదు. కాగా ఈ భారీ సినిమాపై లేటెస్ట్ గా వచ్చిన ఓ వార్త అయ్యితే సంచలనం కూడా రేపింది.

ఊహించని మొత్తం ఏపీ తెలంగాణలో జరిగిన బిజినెస్ లో టాలీవుడ్ హిస్టరీ లోనే రెండో బిగ్గెస్ట్ థియేట్రికల్ బిజినెస్ గా అయితే నిలిచింది. మరి ఇదిలా ఉండగా ఈ భారీ చిత్రం హక్కులు అయితే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు ఏకంగా 170 కోట్లు ఇచ్చి సొంతం చేసుకున్నారని కన్ఫర్మ్ అయ్యింది.

అయితే ఈ మాసివ్ ప్రాజెక్ట్ పై ఇప్పుడు మరిన్ని డీటెయిల్స్ తెలుస్తున్నాయి. మొన్న వచ్చిన ఫిగర్ జి ఎస్ టి లేకుండా కాగా ఇప్పుడు అయితే జి ఎస్ టి తో కలిపి ఆదిపురుష్ కి వారు ఏకంగా 180 కోట్లు చెల్లించి తీసుకున్నారట. ఇది సెన్సేషన్ అని చెప్పాలి. అలాగే ఈ మొత్తం అంతా కూడా నాన్ రిఫండబుల్ గా కూడా డీల్ చేసుకున్నారట.

మరి ఇంత మొత్తం రాబట్టాలి అంటే మాములు విషయం కాదని చెప్పాలి. ఒక్క తెలుగు స్టేట్స్ లో నుంచే ఎలా లేదన్నా 400 కోట్ల గ్రాస్ రాబడితే తప్ప ఆదిపురుష్ సినిమా తెలుగులో లాభాల బాట అందించలేదు. మరి ఈ మొత్తాన్ని అందుకుంటుందో లేదో చూడాలి. కాగా ఈ మాసివ్ ప్రాజెక్ట్ ని రామాయణం ఆధారంగా దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కించగా కృతి సనన్, సైఫ్ అలీఖాన్, సన్నీ సింగ్ తదితరులు ఈ చిత్రంలో కీలక పత్రాలు అయితే చేశారు.