“ఆదిపురుష్” టీం డిజాస్టరస్ ప్లానింగ్స్.!

ఇపుడు ఉన్న ట్రెండ్ లో ఎలాంటి సినిమాకి అయినా అగ్రెసివ్ ప్రమోషన్స్ ఎప్పటికప్పుడు సాలిడ్ అప్డేట్స్ ఎంతగానో అవసరం. అందులోని పాన్ ఇండియా సినిమాలకి అయితే ఇంకా అని చెప్పాలి. కాగా ఇప్పుడు మాత్రం పాన్ ఇండియా ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న “ఆదిపురుష్” సినిమా విషయంలో మాత్రం చిత్ర యూనిట్ ఇప్పుడు డిజాస్టర్ ప్లానింగ్స్ చేస్తున్నారని చెప్పక తప్పదు.

జస్ట్ ఇంకో రెండు వారాలు సమయం మాత్రమే ఉన్నా ఇంకా క్లారిటీ లేని అప్డేట్స్ నే అందిస్తున్నారు. ఇప్పటికే ఎలాంటి ప్రమోషన్స్ లేవు అని ఫ్యాన్స్ అసంతృప్తి గా ఉండగా మరో పక్క అయితే క్లారిటీ లేని అప్డేట్స్ ఇస్తూ వస్తున్నారు. దీనితో అసలు అదేం అప్డేట్ అనేది కూడా అర్ధం కాకుండా ఫ్యాన్స్ ఉన్నారు.

ఇక ప్రస్తుతానికి అయితే చిత్ర యూనిట్ అంతా కూడా ఈ జూన్ 6న జరిగే గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసమే బిజీగా ఉన్నట్టు ఉన్నారు. కానీ ఎలాంటి సరైన ప్లానింగ్స్ లేకపోవడం మాత్రం ఫ్యాన్స్ కి డిజప్పాయింటింగ్ అంశంగా మారింది అనిక్ చెప్పాలి.

కాగా మరో టాక్ ఏమిటంటే సినిమా యూనిట్ నుంచి ఎలాంటి ఇంటర్వూస్ కూడా ఉండవు అని సినీ వర్గాలు వారు అంటున్నారు. మరి లాస్ట్ మినిట్ లో అయితే ఏం జరుగుతుందో చూడాలి. కాగా ఈ సినిమాలో కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్, సన్నీ సింగ్ తదితరులు కీలక పాత్రల్లో నటించగా ఓంరౌత్ దర్శకత్వం వహించారు. అలాగే ఈ జూన్ 16న గ్రాండ్ గా ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.