వైజాగ్ లో ప్రభాస్ సినిమాకి భారీ బిజినెస్.!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా చిత్రం “ఆదిపురుష్” కోసం అందరికీ తెలిసిందే. ఎప్పుడు నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమా ఐతే ఫైనల్ గా ఈ జూన్ లో గ్రాండ్ రిలీజ్ కి సిద్ధం అవుతుంది.

కాగా ఇప్పుడు ఒక్కసారిగా అన్ని అంచనాలు మార్చుకున్న ఈ చిత్రం అన్ని ఏరియాల్లో కూడా రికార్డు బిజినెస్ ని నమోదు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి ట్రైలర్ కన్నా ముందే కేవలం తెలుగు రాష్ట్రాల నుంచి ఏకంగా 100 కోట్ల బిజినెస్ ఆఫర్ ఉన్న ఈ సినిమాపై లేటెస్ట్ ఇన్ఫో ఇంకొకటి తెలుస్తుంది.

ఏపీలో ఉత్తరాంధ్ర వైజాగ్ ఒక్క ఏరియా హక్కులే రికార్డు బిజినెస్ పలికినట్టుగా తెలుస్తుంది. ఎక్కడ రైట్స్ కి ఏకంగా 20 కోట్లు పలికిందట. ఇది మామూలు నెంబర్ కాదని చెప్పాలి. గతంలో RRR కి అయితే ఏ స్థాయిలో ఆఫర్స్ వచ్చాయో ఇప్పుడు మళ్ళీ ఆదిపురుష్ కి అయితే ఇది ఆ రేంజ్ అని చెప్పాలి.

ఇక దీనితో పాటుగా టోటల్ ఆంధ్ర హక్కులు 60 కోట్ల మేర బిజినెస్ ని టచ్ అయ్యినట్టుగా కూడా రూమర్స్ ఉన్నాయి. మొత్తానికి అయితే ఆదిపురుష్ క్రేజ్ ఈ రేంజ్ లో బిజినస్ కి వచ్చింది అని చెప్పాలి. కాగా ఈ చిత్రాన్ని దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కిస్తుండగా కృతి సనన్, సైఫ్ అలీఖాన్, సన్నీ సింగ్ తదితరులు నటించారు. అలాగే ఈ జూన్ 16న గ్రాండ్ గా ఈ సినిమా రాబోతుంది.